హంపి శుభారంభం

భారత గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి స్టావెంజర్‌ చెస్‌ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. మంగళవారం తొలి రౌండ్‌ మొదటి గేమ్‌లో పియా క్రామ్లింగ్‌ (స్విట్జర్లాండ్‌)తో డ్రా చేసుకున్న హంపి.. రెండో గేమ్‌లో విజయాన్ని అందుకుంది.

Published : 29 May 2024 01:47 IST

స్టావెంజర్‌ (నార్వే): భారత గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి స్టావెంజర్‌ చెస్‌ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. మంగళవారం తొలి రౌండ్‌ మొదటి గేమ్‌లో పియా క్రామ్లింగ్‌ (స్విట్జర్లాండ్‌)తో డ్రా చేసుకున్న హంపి.. రెండో గేమ్‌లో విజయాన్ని అందుకుంది. మరోవైపు వెన్‌జున్‌ (చైనా)తో తొలి గేమ్‌లో డ్రాకు అంగీకరించిన వైశాలి.. రెండో గేమ్‌ను చేజార్చుకుంది. దీంతో హంపి 1.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. వైశాలి (1) రెండో స్థానంలో ఉంది. పురుషుల విభాగంలో ప్రజ్ఞానంద గెలుపు బోణీ కొట్టాడు. తొలి రౌండ్‌ మొదటి గేమ్‌లో అలీరెజా (ఫ్రాన్స్‌)తో పాయింట్‌ పంచుకున్న అతడు.. రెండో గేమ్‌లో విజయాన్ని అందుకున్నాడు. ప్రజ్ఞానంద 1.5 పాయింట్లతో మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే),  హికరు నకముర (అమెరికా), అలీరెజా (1.5) కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని