ఏదో ఒక రోజు నన్ను ఎంపిక చేయాల్సిందే

ఐపీఎల్‌లో చాలా ఏళ్ల నుంచి ఆడుతున్నా గొప్ప ప్రదర్శనేమీ చేయని రియాన్‌ పరాగ్‌.. ఈ సీజన్లో నిలకడగా రాణించి ఆకట్టుకున్నాడు. రాజస్థాన్‌ తరఫున అతను 14 మ్యాచ్‌ల్లో 573 పరుగులతో టోర్నీ టాప్‌ స్కోరర్లలో మూడో స్థానం సాధించాడు.

Published : 30 May 2024 02:43 IST

ముంబయి: ఐపీఎల్‌లో చాలా ఏళ్ల నుంచి ఆడుతున్నా గొప్ప ప్రదర్శనేమీ చేయని రియాన్‌ పరాగ్‌.. ఈ సీజన్లో నిలకడగా రాణించి ఆకట్టుకున్నాడు. రాజస్థాన్‌ తరఫున అతను 14 మ్యాచ్‌ల్లో 573 పరుగులతో టోర్నీ టాప్‌ స్కోరర్లలో మూడో స్థానం సాధించాడు. ఈ ప్రదర్శన ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో త్వరలోనే తాను టీమ్‌ఇండియాలోకి వస్తానని అంటున్నాడు పరాగ్‌. ‘‘నేను సరిగా పరుగులు చేయనపుడే ఓ ఇంటర్వ్యూలో చెప్పా.. నేను భారత జట్టుకు ఆడతానని. అది నాపై నాకున్న నమ్మకం. ఇక్కడ అహంకారం ఏమీ లేదు. పదేళ్ల వయసులో క్రికెట్‌ మొదలుపెట్టినపుడే భారత జట్టుకు ఆడతానని అనుకున్నా. ఏదో ఒక దశలో నన్ను భారత జట్టుకు ఎంపిక చేయక తప్పదు. ఎప్పుడన్నది తెలియదు కానీ.. భారత జట్టుకు మాత్రం తప్పకుండా ఆడతా’’ అని పరాగ్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని