సింధు శుభారంభం

భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు సింగపూర్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో సింధు 21-12, 22-20తో లైన్‌ హోజ్‌మార్క్‌ (డెన్మార్క్‌)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌ చేరుకుంది.

Published : 30 May 2024 02:43 IST

లక్ష్యసేన్‌ పరాజయం
సింగపూర్‌ ఓపెన్‌

సింగపూర్‌: భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు సింగపూర్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో సింధు 21-12, 22-20తో లైన్‌ హోజ్‌మార్క్‌ (డెన్మార్క్‌)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌ చేరుకుంది. 44 నిమిషాల పాటు సాగిన పోరులో రెండో గేమ్‌లో  కాస్త పోటీ ఎదురైనా.. సమర్థంగా ఎదుర్కొన్న సింధు ముందంజ వేసింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టగా.. లక్ష్యసేన్‌కు చుక్కెదురైంది. తొలి రౌండ్లో ప్రణయ్‌ 21-9, 18-21, 21-9తో జూలియెన్‌ కరాజి (బెల్జియం)పై విజయం సాధించాడు. లక్ష్యసేన్‌ 13-21, 21-16, 13-21తో టాప్‌ సీడ్‌ విక్టర్‌ అక్సెల్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో పోరాడి ఓడాడు. కిదాంబి శ్రీకాత్‌ 14-21, 3-11 (రిటైర్డ్‌)తో కొడయ్‌ నరవొక (జపాన్‌) చేతిలో, ప్రియాన్షు రజావత్‌ 21-23, 19-21తో లీ చుక్‌ (హాంకాంగ్‌) చేతిలో పరాజయం చవిచూశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని