పార్కులో ప్రాక్టీసా?

టీ20 ప్రపంచకప్‌లో సౌకర్యాలపై భారత జట్టు చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అసంతృప్తి వ్యక్తంజేశాడు. పార్కులో ప్రాక్టీసు చేయడం వింతగా ఉందని పేర్కొన్నాడు.

Published : 05 Jun 2024 03:07 IST

న్యూయార్క్‌: టీ20 ప్రపంచకప్‌లో సౌకర్యాలపై భారత జట్టు చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అసంతృప్తి వ్యక్తంజేశాడు. పార్కులో ప్రాక్టీసు చేయడం వింతగా ఉందని పేర్కొన్నాడు. న్యూయార్క్‌లో మ్యాచ్‌లు ఆడనున్న జట్లకు ప్రధాన స్టేడియానికి అయిదు మైళ్ల దూరంలో ఉన్న కాంటియాగ్‌ పార్కులో సాధనకు ఏర్పాట్లు చేశారు. ‘‘పార్కులో ప్రాక్టీసు చేయడం వింతగా ఉంది. ప్రపంచకప్‌లో పెద్ద స్టేడియాల్లో సాధన ఉంటుంది. సంప్రదాయ క్రికెట్‌ స్టేడియాలు అందుబాటులో ఉంటాయి. కాని మేం ప్రజలు ఉపయోగించుకునే పార్కులో ప్రాక్టీసు చేస్తున్నాం’’ అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని