ఇది మా ‘సూపర్‌ బౌల్‌’

భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ తమకు ‘సూపర్‌ బౌల్‌’ లాంటిదని మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది అన్నాడు. ఈనెల 9న టీ20 ప్రపంచకప్‌లో దాయాదుల మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.

Published : 06 Jun 2024 03:46 IST

న్యూయార్క్‌: భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ తమకు ‘సూపర్‌ బౌల్‌’ లాంటిదని మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది అన్నాడు. ఈనెల 9న టీ20 ప్రపంచకప్‌లో దాయాదుల మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. అమెరికా జాతీయ ఫుట్‌బాల్‌ లీగ్‌ వార్షిక ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ను సూపర్‌ బౌల్‌ అంటారు. ‘‘ఫుట్‌బాల్‌ లీగ్‌ను కనిపెట్టిన అమెరికన్లు.. భారత్, పాక్‌ మ్యాచ్‌ మా సూపర్‌ బౌల్‌ అని తెలుసుకోవాలి. భారత్‌తో ఆడటాన్ని బాగా ఇష్టపడేవాడిని. క్రీడల్లో అతిపెద్ద వైరం ఇదే అని నమ్ముతున్నా. భారత్‌తో మ్యాచ్‌లు ఆడినప్పుడు ఆ దేశ అభిమానుల ప్రేమ, గౌరవాన్ని పొందాను’’ అని అఫ్రిది పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు