బౌలర్లకు ఇష్టంగా.. బ్యాటర్లకు కష్టంగా

బౌలర్లు వికెట్ల పండగ చేసుకుంటున్నారు. బ్యాటర్లేమో చెమటోడుస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌ కోసం నిర్మించిన న్యూయార్క్‌లోని నాసా కౌంటీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలోని మందకొడి పిచ్‌ ఇందుకు కారణం.

Published : 06 Jun 2024 03:55 IST

బౌలర్లు వికెట్ల పండగ చేసుకుంటున్నారు. బ్యాటర్లేమో చెమటోడుస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌ కోసం నిర్మించిన న్యూయార్క్‌లోని నాసా కౌంటీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలోని మందకొడి పిచ్‌ ఇందుకు కారణం. ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చిన డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లు బౌలర్లకు సహకరిస్తూ.. బ్యాటర్లను వణికిస్తున్నాయి. అస్థిర బౌన్స్‌కు కారణమవుతూ హడలెత్తిస్తున్నాయి. దీంతో ఈ మైదానం స్వల్ప స్కోర్లకు వేదికగా మారుతోంది. ఈ ప్రపంచకప్‌లో ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక 77 పరుగులకే కుప్పకూలింది. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు దక్షిణాఫ్రికా 16.2 ఓవర్లు ఆడింది. ఇప్పుడేమో ఐర్లాండ్‌ను 96 పరుగులకే భారత్‌ ఆలౌట్‌ చేసింది. ఈ స్టేడియంలో ఇంకా ఆరు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఇందులో పాకిస్థాన్, అమెరికాతో భారత్‌ తలపడాల్సి ఉంది. ఇప్పటికే ఈ పిచ్‌పై విమర్శలు వస్తున్నాయి. పొట్టి క్రికెట్‌ అంటే భారీ షాట్లను, ధనాధన్‌ ఇన్నింగ్స్‌లను ఆశించే వాళ్లు దీంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి మిగతా మ్యాచ్‌ల్లోనైనా పిచ్‌ ఏమైనా మారుతుందేమో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు