ఈ హార్దిక్‌ వేరు

‘‘హార్దిక్‌ ఒక్కసారి జాతీయ జట్టు జెర్సీ వేసుకుంటే విభిన్నంగా మారిపోతాడు. భారత్‌ తరపున రాణిస్తాడు’’.. ఇవీ కొంతమంది టీమ్‌ఇండియా మాజీలు వెల్లడించిన అభిప్రాయాలు. ఇప్పుడు ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో అతని బౌలింగ్‌ చూశాక ఇది నిజమనిపించక మానదు.

Updated : 06 Jun 2024 08:47 IST

‘‘హార్దిక్‌ ఒక్కసారి జాతీయ జట్టు జెర్సీ వేసుకుంటే విభిన్నంగా మారిపోతాడు. భారత్‌ తరపున రాణిస్తాడు’’.. ఇవీ కొంతమంది టీమ్‌ఇండియా మాజీలు వెల్లడించిన అభిప్రాయాలు. ఇప్పుడు ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో అతని బౌలింగ్‌ చూశాక ఇది నిజమనిపించక మానదు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా తీవ్ర వ్యతిరేకత, అభిమానుల నుంచి ఎగతాళి ఎదుర్కోవడం వల్ల హార్దిక్‌ ప్రదర్శన పడిపోయింది. 14 మ్యాచ్‌ల్లో 216 పరుగులు చేసిన అతను.. 11 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో హార్దిక్‌పై విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. అతణ్ని ప్రపంచకప్‌కు ఎంపిక చేయడంపైనా సందేహాలు రేకెత్తాయి. కానీ టీ20 ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌లోనే హార్దిక్‌ బౌలింగ్‌లో అదరగొట్టాడు. బౌలింగ్‌కు సహకరించిన పిచ్‌పై స్వింగ్, బౌన్స్‌ రాబట్టి.. వైవిధ్యమైన బంతులతో బ్యాటర్లను బుట్టలో వేసుకున్నాడు. 3-1-13-3.. తొలి మూడు ఓవర్లలో హార్దిక్‌ గణాంకాలివి. ఓ మెయిడిన్‌ వేసిన అతను మూడు వికెట్లు తీశాడు. మంచి లయ మీద కనిపించాడు. టోర్నీ సాంతం బౌలింగ్‌లో అతనిదే  జోరు కొనసాగిస్తూ.. బ్యాటింగ్‌లోనూ రాణిస్తే జట్టుకు తిరుగుండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని