దేశవాళీ.. దులీప్‌ ట్రోఫీతో

భారత దేశవాళీ క్రికెట్‌ దులీప్‌ ట్రోఫీతో మొదలు కానుంది. సెప్టెంబర్‌ 5న అనంతపురంలో దులీప్‌ ట్రోఫీ ఆరంభం కాబోతోంది.

Published : 07 Jun 2024 04:12 IST

దిల్లీ: భారత దేశవాళీ క్రికెట్‌ దులీప్‌ ట్రోఫీతో మొదలు కానుంది. సెప్టెంబర్‌ 5న అనంతపురంలో దులీప్‌ ట్రోఫీ ఆరంభం కాబోతోంది. 2024-25 దేశవాళీ షెడ్యూల్‌ గురువారం బీసీసీఐ విడుదల చేసింది. దులీప్‌ ట్రోఫీ తర్వాత ఇరానీ కప్, ఆ తర్వాత రంజీట్రోఫీ జరుగుతాయి.  సీకే నాయుడు టోర్నీలో టాస్‌ను తీసేసి.. పర్యాటక జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్‌ ఎంచుకునే అవకాశాన్ని ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.


పంత్‌ మూడో స్థానంలో కొనసాగుతాడు: రాఠోడ్‌

న్యూయార్క్‌: వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ మూడో స్థానంలో కొనసాగుతాడని భారత జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. బుధవారం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో మూడో నంబరులో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌.. అద్భుతమైన షాట్లతో అదరగొట్టాడు. ‘‘ఔను.. పంత్‌ చాలా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. పంత్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో (వార్మప్, ఐర్లాండ్‌) ఫామ్‌తో కనిపించాడు. ప్రస్తుతానికి అతనే మూడో నంబరు బ్యాటర్‌. పంత్‌ ఎడమచేతి వాటం బ్యాటర్‌ కావడం కలిసొచ్చేదే’’ అని రాఠోడ్‌ తెలిపాడు.


ఫైనల్లో అమన్‌ 

బుడాపెస్ట్‌: భారత రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌ బుడాపెస్ట్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌లో ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్‌లో అమన్‌ 14-4తో ఆర్యన్‌ సియుట్రిన్‌ (రష్యా- బెలారస్‌)పై విజయం సాధించాడు. ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ రజత పతక విజేత హిగుచి (జపాన్‌)తో అమన్‌ తలపడతాడు. భారత్‌ తరఫున పురుషుల విభాగంలో పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రెజ్లర్‌ అమన్‌ మాత్రమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని