మోకాలి శస్త్రచికిత్స విజయవంతం

తన కుడి మోకాలికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైనట్లు టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ తెలిపాడు.

Published : 07 Jun 2024 04:13 IST

పారిస్‌: తన కుడి మోకాలికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైనట్లు టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ తెలిపాడు. వీలైనంత త్వరగా మళ్లీ బరిలో దిగాలని భావిస్తున్నట్లు చెప్పాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫ్రాన్సిస్కో సెరుండోలోతో నాలుగో రౌండ్‌ మ్యాచ్‌లో జకోవిచ్‌ గాయపడ్డాడు. బుధవారం అతని మోకాలికి శస్త్రచికిత్స నిర్వహించారు. ‘‘గత మ్యాచ్‌లో గాయపడ్డాక కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. శస్త్రచికిత్స బాగా జరిగినందుకు ఆనందంగా ఉంది. నా పక్కనున్న వైద్య బృందానికి అభినందనలు. వీలైనంత త్వరగా ఫిట్‌నెస్‌ సాధించి కోర్టులో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తా’’ అని జకోవిచ్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని