అక్కడ కోడింగ్‌.. ఇక్కడ బౌలింగ్‌

మైదానంలో దిగితే బ్యాటర్‌ను ఔట్‌ చేయడం గురించే ఆలోచిస్తానని, ఆఫీస్‌కు వెళ్తే కోడింగ్‌ను ఆస్వాదిస్తానని అమెరికా పేసర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌ చెప్పాడు.

Updated : 08 Jun 2024 05:10 IST

దిల్లీ: మైదానంలో దిగితే బ్యాటర్‌ను ఔట్‌ చేయడం గురించే ఆలోచిస్తానని, ఆఫీస్‌కు వెళ్తే కోడింగ్‌ను ఆస్వాదిస్తానని అమెరికా పేసర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌ చెప్పాడు. పాక్‌పై సూపర్‌ ఓవర్లో గొప్పగా బౌలింగ్‌ చేసి జట్టును గెలిపించిన సౌరభ్‌.. ఒరాకిల్‌ సంస్థలో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ‘‘ఎప్పుడూ ఒత్తిడిగా భావించలేదు. చేసేదాన్ని ప్రేమిస్తే ఎప్పుడూ అలా అనిపించదు. మైదానంలో అడుగుపెడితే బ్యాటర్‌ను ఎలా ఔట్‌ చేయాలనే ఆలోచిస్తా. అదే కోడింగ్‌ చేసే సమయంలో ఆ పనిని ఆస్వాదిస్తా. అదెప్పుడూ పనిలాగా అనిపించలేదు. ఇప్పటికీ ఆ ఉద్యోగమే నా ప్రాథమిక జీవనాధారం. ఒరాకిల్‌లో నాకు మద్దతుగా నిలిచే బాస్‌లున్నారు. అమెరికా తరపున ఆడేందుకు బయటకు వెళ్తే అక్కడి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పిస్తారు. మ్యాచ్‌ రోజుల్లో మినహాయింపునిస్తారు. కానీ ముందుగా నిర్ణయించిన ప్రాజెక్టు సమావేశాలకు హాజరవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా యుఎస్‌ క్రికెట్‌ బోర్డు కూడా నాకు అండగా నిలుస్తోంది. ఒరాకిల్‌ టెక్ట్స్‌ టీమ్‌లో నేను పనిచేస్తున్నా. కోడింగ్‌ చేస్తా. సూపర్‌ ఓవర్‌ కోసం ముందస్తు ప్రణాళికలేమీ వేసుకోలేదు. వికెట్లకు దూరంగా యార్కర్లు వేద్దామనే ప్రయత్నించా. ఈ విజయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం’’ అని సౌరభ్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని