ఈఫిల్‌ టవర్‌పై ఒలింపిక్‌ రింగ్‌లు

ఒలింపిక్స్‌ సమీపిస్తున్న కొద్దీ ఆతిథ్య పారిస్‌లో సందడి పెరుగుతోంది. ఈ మెగా ఈవెంట్‌ ఆరంభానికి మరో 50 రోజుల సమయమే ఉన్న నేపథ్యంలో శుక్రవారం సెంట్రల్‌ పారిస్‌లో ఉన్న ప్రసిద్ధ ఈఫిల్‌ టవర్‌ మధ్యలో అయిదు ఒలింపిక్‌ రింగ్‌లు ఏర్పాటు చేశారు.

Updated : 08 Jun 2024 05:10 IST

పారిస్‌: ఒలింపిక్స్‌ సమీపిస్తున్న కొద్దీ ఆతిథ్య పారిస్‌లో సందడి పెరుగుతోంది. ఈ మెగా ఈవెంట్‌ ఆరంభానికి మరో 50 రోజుల సమయమే ఉన్న నేపథ్యంలో శుక్రవారం సెంట్రల్‌ పారిస్‌లో ఉన్న ప్రసిద్ధ ఈఫిల్‌ టవర్‌ మధ్యలో అయిదు ఒలింపిక్‌ రింగ్‌లు ఏర్పాటు చేశారు. ఉపయోగించిన స్టీల్‌తో తయారైన ఈ వలయాలు.. ఒక్కోటి సుమారు 9 మీటర్ల పొడవు ఉన్నాయి. ప్రతిరోజు రాత్రి లక్ష ఎల్‌ఈడీ దీపాలతో ఇవి వెలిగిపోనున్నాయి. జులై 26న ఒలింపిక్స్‌ ఆరంభోత్సవం రోజు ఈఫిల్‌ టవర్‌ సమీపంగా ఉండే సెన్‌ నదిలో పడవలపై వేలాది మంది అథ్లెట్లు 6 కిలోమీటర్ల మేర పరేడ్‌ నిర్వహించనున్నారు. పారిస్‌ ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో విజేతలకు ఇచ్చే పతకాలను ఈఫిల్‌ టవర్‌ నుంచి తీసుకున్న ఉక్కుతో తయారు చేయడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని