సమాచార లోపం వల్లే: శ్రేయస్‌

సమాచార లోపం వల్లే కొన్ని నిర్ణయాలు తనకు అనుకూలంగా రాలేదని టీమ్‌ఇండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అన్నాడు. వన్డే ప్రపంచకప్‌లో ఆకట్టుకున్నా..

Published : 08 Jun 2024 03:08 IST

ముంబయి: సమాచార లోపం వల్లే కొన్ని నిర్ణయాలు తనకు అనుకూలంగా రాలేదని టీమ్‌ఇండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అన్నాడు. వన్డే ప్రపంచకప్‌లో ఆకట్టుకున్నా.. దేశవాళీ క్రికెట్‌ను విస్మరించాడనే కారణంతో బీసీసీఐ శ్రేయస్‌ అయ్యర్‌కు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఇవ్వని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రేయస్‌ మాట్లాడుతూ.. ‘‘వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటాను. ఆ తర్వాత విరామం తీసుకుందామని అనుకున్నా. కానీ సమాచార లోపం వల్ల కొన్ని నిర్ణయాలు అనుకూలంగా రాలేదు. పరిస్థితులు ఎలా ఉన్నా బ్యాటర్‌గా రాణిస్తేనే భవిష్యత్‌ అని అర్థం అయింది. రంజీ ట్రోఫీ, ఐపీఎల్‌లోనూ ఇదే అమలు చేశాను. విమర్శకులకు నా సమాధానం ఇదే’’ అని శ్రేయస్‌ చెప్పాడు. రంజీ సెమీస్, ఫైనల్‌ ఆడిన అతడు ముంబయి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా జట్టుకు సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్‌ అందించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు