అన్షుకు రజతం

బుడాపెస్ట్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌ టోర్నీలో భారత రెజ్లర్‌ అన్షు మలిక్‌ రజతం సాధించింది. మహిళల 57 కేజీల విభాగం ఫైనల్లో అన్షు 1-12తో కెగ్జిన్‌ హంగ్‌ (చైనా) చేతిలో ఓడింది. సాంకేతికంగా బలంగా కనిపించిన హంగ్‌ తేలిగ్గా ఈ బౌట్‌ను కైవసం చేసుకుంది.

Published : 09 Jun 2024 03:55 IST

బుడాపెస్ట్‌: బుడాపెస్ట్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌ టోర్నీలో భారత రెజ్లర్‌ అన్షు మలిక్‌ రజతం సాధించింది. మహిళల 57 కేజీల విభాగం ఫైనల్లో అన్షు 1-12తో కెగ్జిన్‌ హంగ్‌ (చైనా) చేతిలో ఓడింది. సాంకేతికంగా బలంగా కనిపించిన హంగ్‌ తేలిగ్గా ఈ బౌట్‌ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో భారత్‌కు లభించిన మూడో రజతమిది. అంతిమ్‌ ఫంగాల్‌ (53 కేజీ), అమన్‌ సెహ్రావత్‌   (57 కేజీ) ఇప్పటికే ఫైనల్లో ఓడి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు.  స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ (50 కేజీ) క్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని