కివీస్‌కు అఫ్గాన్‌ షాక్‌

అఫ్గానిస్థాన్‌ అదరహో! కూన కుమ్మేసింది. టీ20 ప్రపంచకప్‌లో పెను సంచలనం సృష్టిస్తూ అఫ్గాన్‌ 84 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. శనివారం గుర్బాజ్‌ (80; 56 బంతుల్లో 5×4, 5×6) చెలరేగడంతో మొదట అఫ్గాన్‌ 6 వికెట్లకు 159 పరుగులు చేసింది.

Published : 09 Jun 2024 03:56 IST

84 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ చిత్తు 

జార్జ్‌టౌన్‌ (గయానా): అఫ్గానిస్థాన్‌ అదరహో! కూన కుమ్మేసింది. టీ20 ప్రపంచకప్‌లో పెను సంచలనం సృష్టిస్తూ అఫ్గాన్‌ 84 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. శనివారం గుర్బాజ్‌ (80; 56 బంతుల్లో 5×4, 5×6) చెలరేగడంతో మొదట అఫ్గాన్‌ 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్‌ (44; 41 బంతుల్లో 3×4, 2×6)తో తొలి వికెట్‌కు గుర్బాజ్‌ 103 పరుగులు జోడించాడు. పేస్, స్పిన్‌కు సహకరించిన పిచ్‌పై ఛేదనలో న్యూజిలాండ్‌ తేలిపోయింది. ఫాస్ట్‌బౌలర్‌ ఫారూఖీ (4/17), స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (4/17) ధాటికి 15.2 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. 18 పరుగులు చేసిన ఫిలిప్స్‌ టాప్‌ స్కోరర్‌. గుర్బాజ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్న అఫ్గానిస్థాన్‌.. గ్రూప్‌-సిలో అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు తన తొలి మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో ఉగాండాను మట్టికరిపించింది.

సంక్షిప్త స్కోర్లు... అఫ్గానిస్థాన్‌: 159/6 (గుర్బాజ్‌ 80, ఇబ్రహీం జద్రాన్‌ 44, అజ్మతుల్లా 22; బౌల్ట్‌ 2/22, హెన్రీ 2/37, ఫెర్గూసన్‌ 1/28); న్యూజిలాండ్‌: 75 (ఫిలిప్స్‌ 18, హెన్రీ 12, విలియమ్సన్‌ 9, కాన్వే 8; ఫారూఖీ 4/17, రషీద్‌ ఖాన్‌ 4/17, నబి 2/16)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని