ఉగాండా చిత్తు చిత్తుగా..

పసికూనపై వెస్టిండీస్‌పై చెలరేగిపోయింది. ఎడమచేతి వాటం స్పిన్నర్‌ అకీల్‌ హొసీన్‌ (5/11) విజృంభించడంతో గ్రూప్‌-సి మ్యాచ్‌లో విండీస్‌ 134 పరుగుల తేడాతో ఉగాండాను చిత్తు చేసింది.

Published : 10 Jun 2024 04:19 IST

వెస్టిండీస్‌ ఘనవిజయం 

ప్రావిడెన్స్‌: పసికూనపై వెస్టిండీస్‌పై చెలరేగిపోయింది. ఎడమచేతి వాటం స్పిన్నర్‌ అకీల్‌ హొసీన్‌ (5/11) విజృంభించడంతో గ్రూప్‌-సి మ్యాచ్‌లో విండీస్‌ 134 పరుగుల తేడాతో ఉగాండాను చిత్తు చేసింది.  మొదట వెస్టిండీస్‌ 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. చార్లెస్‌ (44), రసెల్‌ (30 నాటౌట్‌) రాణించారు. ఛేదనలో ఉగాండా విలవిల్లాడింది. అకీల్‌ మాయాజాలానికి ఆ జట్టు 12 ఓవర్లలో 39 పరుగులకే కుప్పకూలింది. జుమా మియాగి (13 నాటౌట్‌) ఒక్కడే రెండంకెల స్కోరు సాధించాడు. ఉగాండా స్కోరు టీ20 ప్రపంచకప్‌ చరిత్రలోనే సంయుక్త అత్యల్ప స్కోరు. నెదర్లాండ్స్‌ (2014లో శ్రీలంకపై 39) రికార్డును ఉగాండా సమం చేసింది. భారీ విజయంతో వెస్టిండీస్‌ నెట్‌ రన్‌రేట్‌నూ బాగా మెరుగుపర్చుకుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆ జట్టు.. గ్రూప్‌లో రెండో స్థానంలో ఉంది.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: 173/5 (చార్లెస్‌ 44, రసెల్‌ 30 నాటౌట్, పావెల్‌ 23, రూథర్‌ఫోర్డ్‌ 22, పూరన్‌ 22; మసాబా 2/31); ఉగాండా ఇన్నింగ్స్‌: 39 (జుమా మియాగి 13 నాటౌట్, ఒబుయా 6, అల్పేష్‌ 5, సెసాజి 4; అకీల్‌ హొసీన్‌ 5/11)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు