ఐపీఎల్‌ ఆడకపోవడం మంచి నిర్ణయం

టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌ నుంచి వైదొలగడం తాను తీసుకున్న మంచి నిర్ణయమని ఆస్ట్రేలియా స్పిన్నర్‌ అడమ్‌ జంపా అన్నాడు. అతడు ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

Published : 10 Jun 2024 04:21 IST

బ్రిడ్జ్‌టౌన్‌: టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌ నుంచి వైదొలగడం తాను తీసుకున్న మంచి నిర్ణయమని ఆస్ట్రేలియా స్పిన్నర్‌ అడమ్‌ జంపా అన్నాడు. అతడు ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్‌ ఓపెనర్లు సాల్ట్, బట్లర్‌లు ఇద్దరినీ జంపా వెనక్కి పంపాడు. ‘‘ప్రపంచకప్‌ నేపథ్యంలో ఐపీఎల్‌ నుంచి తప్పుకోవడం నేను తీసుకున్న మంచి నిర్ణయమని అనుకుంటున్నా. అప్పుడు నేను అలసిపోయా. చిన్న చిన్న గాయాలు కూడా ఉండేవి’’ అని జంపా అన్నాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జంపా బంతితో రాణించడంతో ఆసీస్‌ శనివారం 36 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. వార్నర్‌ (39), మార్ష్‌ (35), హెడ్‌ (34), స్టాయినిస్‌ (30) రాణించడంతో మొదట ఆస్ట్రేలియా 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఛేదనలో ఇంగ్లాండ్‌ 6 వికెట్లకు 165 పరుగులే సాధించింది. జంపాతో పాటు కమిన్స్‌ (2/23), హేజిల్‌వుడ్‌ (1/28) బంతితో రాణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని