భారీ విజయంపై పాక్‌ కన్ను

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించే ముప్పును ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌.. మరో పోరుకు సిద్ధమైంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో కెనడాను ఢీకొంటుంది.

Published : 11 Jun 2024 03:20 IST

నేడు కెనడాతో ఢీ

న్యూయార్క్‌: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించే ముప్పును ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌.. మరో పోరుకు సిద్ధమైంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో కెనడాను ఢీకొంటుంది. పాక్‌ తన తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో, ఆ తర్వాత భారత్‌ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. సూపర్‌-8కు అర్హత సాధించే అవకాశాలుండాలంటే ఆ జట్టు.. గ్రూప్‌-ఎలో మిగిలిన తన రెండు మ్యాచ్‌ల్లో కెనడా, ఐర్లాండ్‌లపై భారీ విజయాలు సాధించాలి. అదే సమయంలో అమెరికా తన మిగతా రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ తేడాతో ఓడిపోవాలి. పాక్‌ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి, అమెరికా రెండూ ఓడితే రెండు జట్లూ నాలుగు పాయింట్లతో సమమవుతాయి. అప్పుడు నెట్‌ రన్‌రేట్‌ కీలకమవుతుంది. అమెరికా ప్రస్తుతం మెరుగైన రన్‌రేట్‌ (+0.626)తో ఉంది. -0.150తో ఉన్న పాకిస్థాన్‌ ముందంజ వేయాలంటే చాలా పెద్ద విజయాలు సాధించాలి. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన చేసిన ఆ జట్టు.. కెనడాతో పోరులో ఎలా పుంజుకుంటుందో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని