మ్యాచ్‌లు రద్దవడం చికాకు తెప్పిస్తుంది: గిల్‌

వర్షాలు మ్యాచ్‌లను ప్రభావితం చేయడం ఇరుజట్ల ఆటగాళ్లకు, డబ్బులు చెల్లించే అభిమానులకు చికాకు తెప్పిస్తుందని టీమ్‌ఇండియా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అన్నాడు.

Published : 28 Nov 2022 03:42 IST

హామిల్టన్‌: వర్షాలు మ్యాచ్‌లను ప్రభావితం చేయడం ఇరుజట్ల ఆటగాళ్లకు, డబ్బులు చెల్లించే అభిమానులకు చికాకు తెప్పిస్తుందని టీమ్‌ఇండియా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అన్నాడు. క్రికెట్‌ మ్యాచ్‌ల్ని ఇండోర్‌ స్టేడియాల్లో నిర్వహించడం చెడు ప్రత్యమ్నాయమేమీ కాదని గిల్‌ తెలిపాడు. న్యూజిలాండ్‌లో టీమ్‌ఇండియా పర్యటనలో తొలి టీ20, రెండో వన్డే వర్షం కారణంగా రద్దవగా.. మూడో టీ20 ఫలితం డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ద్వారా తేలింది. ‘‘ఇండోర్‌ స్టేడియంలో ఆటపై నిర్ణయం క్రికెట్‌ బోర్డులు తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మ్యాచ్‌లు వర్షంతో ప్రభావితమవడం మైదానంలోకి వెళ్లి వచ్చే ఆటగాడిగా, అభిమానులుగా చికాకు తెప్పిస్తుంది. చాలా నిరాశ కలిగిస్తుంది. మ్యాచ్‌లో ఎన్ని ఓవర్లు ఉంటాయో తెలియదు. ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించుకోవాలో అర్థంకాదు’’ అని గిల్‌ వ్యాఖ్యానించాడు. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌ గురించి ఇప్పుడే ఆలోచించట్లేదని గిల్‌ చెప్పాడు. ‘‘అంత దూరం ఆలోచించట్లేదు. నాకు లభించే అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలన్నదే లక్ష్యం. జట్టు కోసం భారీగా పరుగులు రాబట్టాలని కోరుకుంటున్నా’’ అని గిల్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని