బీసీసీఐ అధ్యక్షుడికి నోటీసులు

పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీకి బోర్డు ఎథిక్స్‌ అధికారి వినీత్‌ శరణ్‌ నోటీసులు జారీచేశాడు.

Published : 30 Nov 2022 02:41 IST

దిల్లీ: పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీకి బోర్డు ఎథిక్స్‌ అధికారి వినీత్‌ శరణ్‌ నోటీసులు జారీచేశాడు. ఆరోపణలపై డిసెంబరు 20 లోగా స్పందించాలని పేర్కొన్నాడు. సంజీవ్‌ గుప్తా అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బిన్నీకి శరణ్‌ నోటీసులు ఇచ్చాడు. స్వదేశంలో భారత్‌ ఆడే క్రికెట్‌ ప్రసార హక్కులను కలిగి ఉన్న స్టార్‌స్పోర్ట్స్‌లో బిన్నీ కోడలు పని చేస్తోందని ఫిర్యాదులో గుప్తా పేర్కొన్నాడు. 67 ఏళ్ల బిన్నీ గత నెలలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని