‘ఉష సారథ్యంలో మరిన్ని పతకాలు’

భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా పీటీ ఉష బాధ్యతలు స్వీకరించబోతుండడం గొప్ప విషయమని టీటీ దిగ్గజం శరత్‌ కమల్‌్ అన్నాడు.

Updated : 01 Dec 2022 04:28 IST

దిల్లీ: భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా పీటీ ఉష బాధ్యతలు స్వీకరించబోతుండడం గొప్ప విషయమని టీటీ దిగ్గజం శరత్‌ కమల్‌ అన్నాడు. ‘‘ఐఓఏ తర్వాతి అధ్యక్షురాలిగా దేశంలో క్రీడల్లో మహిళా ఐకాన్‌గా ఉన్న ఉష ఎన్నికవడం గొప్ప విషయం. ఆమె సారథ్యంలో ఒలింపిక్స్‌తో సహా అంతర్జాతీయ టోర్నీల్లో భారత్‌ మరిన్ని పతకాలు సాధిస్తుంది. ఇటీవల కాలంలో భారత క్రీడా పాలన రంగంలో జరిగిన అత్యుత్తమ విషయం ఇదే. సానుకూల మార్పులతో భారత క్రీడా రంగాన్ని ఆమె ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని అనుకుంటున్నా’’ అని అతను చెప్పాడు. పాలన రంగంలో ఎంతో అవగాహన, అనుభవం ఉన్న ఉష వల్ల ఐఓఏకు, భారత క్రీడా రంగానికి మేలు జరుగుతుందని పారా బ్యాడ్మింటన్‌ స్టార్‌ మాన్సి జోషి అభిప్రాయపడింది. సరైన మార్గంలో ఇదో గొప్ప అడుగు అని, భారత క్రీడా రంగాన్ని అద్భుతాల దిశగా నడిపించే సామర్థ్యం ఉషకు ఉందని షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తెలిపాడు. భారత క్రీడా పాలన రంగంలో ఉష కొత్త ప్రమాణాలు నెలకొల్పుతుందని షూటర్‌ ఎలవెనిల్‌ వలరివన్‌ చెప్పింది.  ఉష ఎంపిక భారత క్రీడలకు ఎంతో మంచిదని చెస్‌ సంచలనం ప్రజ్ఞానంద అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని