లబుషేన్‌, స్మిత్‌ ద్విశతకాలు

వెస్టిండీస్‌తో  తొలి టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు సాధించింది. మార్నస్‌ లబుషేన్‌ (204; 350 బంతుల్లో 20×4, 1×6), స్టీవ్‌ స్మిత్‌ (200 నాటౌట్‌; 311 బంతుల్లో 17×4) డబుల్‌ సెంచరీలతో కదం తొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌ను 598/4 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.

Published : 02 Dec 2022 02:52 IST

ఆస్ట్రేలియా 598/4 డిక్లేర్డ్‌

పెర్త్‌: వెస్టిండీస్‌తో  తొలి టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు సాధించింది. మార్నస్‌ లబుషేన్‌ (204; 350 బంతుల్లో 20×4, 1×6), స్టీవ్‌ స్మిత్‌ (200 నాటౌట్‌; 311 బంతుల్లో 17×4) డబుల్‌ సెంచరీలతో కదం తొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌ను 598/4 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. గురువారం, రెండోరోజు ఓవర్‌నైట్‌ స్కోరు 293/2తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌ను లబుషేన్‌, స్మిత్‌ నడిపించారు. తొలిరోజే శతకం సాధించిన లబుషేన్‌ (154) అదే జోరుతో డబుల్‌ సెంచరీ మార్కు అందుకోగా.. స్మిత్‌ కూడా శతకం పూర్తి చేసుకున్నాడు. లంచ్‌కు ముందు మార్నస్‌ వెనుదిరిగాడు. స్టీవ్‌తో కలిసి మూడో వికెట్‌కు అతడు 251 పరుగులు జత చేశాడు. ఆ తర్వాత ట్రావిస్‌ హెడ్‌ (99; 95 బంతుల్లో 11×4) అండతో స్మిత్‌ ఆసీస్‌ స్కోరును 600 పరుగుల చేరువగా తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే అతడు డబుల్‌ సెంచరీ (311 బంతుల్లో) చేశాడు. హెడ్‌ ఔటైన తర్వాత ఆసీస్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. కెరీర్‌లో స్మిత్‌కు ఇది నాలుగో ద్విశతకం. బదులుగా వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆట చివరికి 74/0తో నిలిచింది. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన శివ్‌ నారాయణ్‌ చందర్‌పాల్‌ తనయుడు తేజ్‌ నారాయణ్‌ చందర్‌పాల్‌ (47 బ్యాటింగ్‌; 73 బంతుల్లో 6×4, 1×6) తొలి ఇన్నింగ్స్‌లోనే ఆకట్టుకున్నాడు. విండీస్‌ ఇంకా 524 పరుగులు వెనుకబడి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని