Hanuma Vihari: క్రికెట్‌లో రాజకీయ నేత జోక్యం.. ఇక ఆంధ్రకు ఆడను: హనుమ విహారి

భవిష్యత్‌లో ఆంధ్ర క్రికెట్‌ జట్టుకు ఆడబోనని హనుమ విహారి వెల్లడించాడు. క్రికెట్‌లో ఏపీ రాజకీయ నేత జోక్యం ఉందని మనస్తాపం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో విహారి పోస్టు చేశారు.

Updated : 26 Feb 2024 17:36 IST

అమరావతి: భవిష్యత్‌లో ఆంధ్ర క్రికెట్‌ జట్టుకు ఆడబోనని హనుమ విహారి వెల్లడించాడు. క్రికెట్‌లో ఏపీ రాజకీయ నేత జోక్యం ఉందని మనస్తాపం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో విహారి పోస్టు చేశారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఉండలేనని తెలిపాడు. 

‘‘రాజకీయ నేత కుమారుడి కోసం నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. రంజీ మ్యాచ్‌ సందర్భంగా 17వ ఆటగాడిపై ఆటపరంగా అరిచాను. అతను నాపై రాజకీయ నేత అయిన తన తండ్రికి చెప్పాడు. ఆయన నాపై చర్యల కోసం ఏసీఏపై ఒత్తిడి చేశాడు. ఆ ఒత్తిడితోనే నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. వ్యక్తిగతంగా నేను ఎవరినీ ఏమీ అనలేదు’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని