Harbhajan: పీసీఏ అధ్యక్షుడిపై హర్భజన్‌ సింగ్‌ తీవ్ర ఆరోపణలు

పంజాబ్ క్రికెట్‌ అసోసియేషన్‌ చీఫ్‌ గుల్‌జరిందర్‌ సింగ్‌ చాహల్‌పై ప్రధాన సలహాదారుడు, ఎంపీ హర్భజన్‌ సింగ్‌ తీవ్ర ఆరోపణలతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేశారు. 

Published : 08 Oct 2022 00:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రాజ్యసభ సభ్యుడు, మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ బహిరంగ లేఖ తీవ్ర చర్చకు దారితీసింది. పంజాబ్ క్రికెట్‌ అసోసియేషన్ (పీసీఏ) అధ్యక్షుడు గుల్జరిందర్‌ సింగ్‌ చాహల్‌ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఆరోపిస్తూ పీసీఏ సభ్యులకు హర్భజన్‌ రాశారు. ప్రస్తుతం హర్భజన్‌ కూడా పీసీఏ ప్రధాన సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు. చాహల్‌కు ఇష్టం వచ్చినట్టుగా కొత్త సభ్యులను తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు భజ్జీ ఆరోపించారు. సత్వరమే బోర్డు సభ్యులు సమావేశమై అలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. 

‘‘క్రికెట్ పరిపాలన, పారదర్శకతను పక్కన పెట్టి మరీ సభ్యుల నియామకం చేపడుతున్నట్లు ప్రస్తుత పీసీఏ అధ్యక్షుడు గుల్జరిందర్‌పై గత పది రోజులుగా అభిమానులు, ఇతర సభ్యుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అలాగే అంబుడ్స్‌మన్‌కి ఫిర్యాదులు అందాయని నాకు తెలిసింది. ఇదంతా బీసీసీఐ రాజ్యాంగం, మార్గదర్శకాలకు విరుద్ధం. క్రీడా పరిపాలన విభాగంలో పారదర్శకతకు సంబంధించిన నియమాలను పీసీఏ అధ్యక్షుడు ఉల్లంఘిస్తున్నారు. పీసీఏ సాధారణ సమావేశాలూ నిర్వహించడం లేదు. సుమోటోగా తమకు కావాల్సిన విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు’’ అని హర్భజన్‌ లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని