Hardik Pandya: ‘ముంబయి’ లేకుంటే ప్రపంచ క్రికెట్‌లో నేను లేను: పాండ్య

Hardik Pandya: ఐపీఎల్‌ 2024లో ముంబయి ఇండియన్స్‌ టీమ్‌కు సారథ్యం వహించనున్న ఆల్‌రౌంటర్‌ హార్దిక్‌ పాండ్య తాజాగా ఓ క్రీడా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

Published : 03 Mar 2024 20:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ (IPL-2024) సందడి మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈసారి రోహిత్‌ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్‌ టీమ్‌కు హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) సారథ్యం వహించనున్న విషయం తెలిసిందే. ఆట మొదలు కానున్న తరుణంలో ఓ క్రీడా ఛానల్‌ ఫ్యాన్‌ ఈవెంట్‌లో హార్దిక్‌ మాట్లాడాడు. 2015 ఐపీఎల్‌లో ముంబయి జట్టుకు ఆడటంతోనే తన ప్రయాణం మొదలైందంటూ పాండ్య ఆ నాటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకున్నాడు.

‘‘అది (2015) నా జీవితంలో ప్రత్యేకమైన సంవత్సరం. ఇక్కడే ప్రయాణం మొదలైంది. ఎన్నో ఆశలతో గుజరాత్‌ నుంచి వచ్చిన ఓ అబ్బాయి కలలు ఆ సమయంలో నెరవేరాయి. ముంబయి ఇండియన్స్ లేకుంటే ప్రపంచ క్రికెట్‌లో ఈ స్థాయికి చేరుకునేవాడిని కాదు. మొత్తం సీజన్‌లో ముంబయి జట్టుకు నా వంతు సాకారం అందించా. అదే లీగ్‌లో రెండు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డులు రావడం ఎప్పటికీ మరచిపోలేను’’ అని పాండ్య తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని