Harman-Powar: మా మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవు.. అది బీసీసీఐ నిర్ణయం: హర్మన్
మహిళల టీ20 ప్రపంచకప్ 2023 మరో రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల జట్టు ప్రధాన కోచ్ రమేశ్ పొవార్‌ను తప్పించి ఎన్‌సీఏకి పంపించింది. కెప్టెన్ హర్మన్‌తోపాటు క్రికెటర్లతో విభేదాలే కారణమనే చర్చ కొనసాగుతోంది. దీనికి హర్మన్ సమాధానం ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల క్రికెట్ ప్రధాన కోచ్ పదవి నుంచి రమేశ్ పొవార్‌ను తప్పిస్తూ గత వారం బీసీసీఐ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కోచ్ పేరును ప్రకటించలేదు. అయితే బ్యాటింగ్ కోచ్‌గా హృషికేష్ కనిత్కర్‌ను నియమించింది. టీమ్‌ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌తో పడకపోవడమే రమేశ్ పొవార్ పదవి పోవడానికి ప్రధాన కారణమనే చర్చ నడుస్తోంది. దీనిపై తాజాగా హర్మన్ స్పందించింది. మాజీ కోచ్‌తో ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేసింది. పొవార్‌తో కలిసి జట్టు విజయం కోసం ఆనందంగా కలిసిమెలిసి పని చేసినట్లు గుర్తు చేసుకొంది.
ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ సందర్భంగా హర్మన్ ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో పాల్గొంది. గురువారం నుంచి ముంబయి వేదికగా సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా హర్మన్ మాట్లాడుతూ.. ‘‘రమేశ్ పొవార్ పని విధానం మాకు నచ్చలేదనే రూమర్లు అవాస్తవం. అతడితో ఎలాంటి వివాదం లేదు. మేమెంతో చాలా సంతోషంగా వర్క్ చేశాం. ఎన్నో విషయాలను నేర్చుకొని టీమ్‌గా ఎదిగాం. ఇప్పుడు పొవార్‌ను ప్రధాన కోచ్ పదవి నుంచి తీసేసి ఎన్‌సీఏ (జాతీయ క్రికెట్ అకాడమీ)కి బీసీసీఐ పంపించింది. అక్కడ స్పిన్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. మేం వెళ్లినప్పుడు తప్పకుండా అందుబాటులో ఉంటారు. అలాగే కనిత్కర్ నిశ్శబ్దంగా ఉంటారు. శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనతో పనిచేసిన అనుభవం మాకుంది. ఎలాంటి సందర్భంలోనైనా అందుబాటులో ఉండే వ్యక్తి. బీసీసీఐ తీసుకొనే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటాం’’ అని హర్మన్ వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs NZ: సవాళ్లను స్వీకరించడం బాగుంటుంది.. అందుకే తొలుత బ్యాటింగ్: హార్దిక్ పాండ్య
-
General News
KTR: మనం ఎందుకు అలా ఆలోచించడం లేదు?: కేటీఆర్
-
General News
Andhra News: కిరండోల్-విశాఖ మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
-
World News
iCET: అవన్నీ జరిగేవి కావులే.. భారత్-అమెరికా ఒప్పందంపై చైనా వాఖ్యలు
-
Politics News
Perni Nani: ట్యాపింగ్ జరిగితే మాత్రం ఏమవుతుంది?: పేర్ని నాని
-
India News
Vande Metro: ఊళ్ల నుంచి నగరాలకు ‘వందే మెట్రో’.. రైల్వే మంత్రి కీలక ప్రకటన