Harmanpreet: హర్మన్‌ప్రీత్‌ హ్యాట్రిక్‌.. భారత్‌ విజయం

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌ నమోదు చేయడంతో ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ హాకీలో భారత్‌ 5-4తో అర్జెంటీనాను ఓడించింది.

Published : 28 May 2024 02:51 IST

ఆంట్వెర్ప్‌ (బెల్జియం): కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌ నమోదు చేయడంతో ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ హాకీలో భారత్‌ 5-4తో అర్జెంటీనాను ఓడించింది. ఆరంభంలో రెండు జట్లు నువ్వానేనా అన్నట్టుగా పోరాడాయి. ఫెడెరికో మోంజా (3వ నిమిషం) మూడో నిమిషంలోనే గోల్‌ కొట్టడంతో అర్జెంటీనా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అరైజీత్‌ సింగ్‌ హుండాల్‌ (7వ నిమిషం) గోల్‌తో భారత్‌ నాలుగు నిమిషాల్లోనే స్కోరు సమం చేసింది. ఆ తర్వాత గుర్జాంత్‌ సింగ్‌ (18వ), హర్మన్‌ప్రీత్‌ (29వ, 50వ, 52వ నిమిషం) జట్టును విజయపథంలో నడిపారు. అర్జెంటీనా మరో రెండు గోల్స్‌ చేసినా.. భారత్‌ ఆఖరి వరకు ఆధిక్యాన్ని కొనసాగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని