IPL 2023: ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా హ్యారీ బ్రూక్ నిలుస్తాడు: ఇంగ్లాండ్ మాజీ పేసర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) కొత్త సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. పది ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను సిద్ధం చేసుకున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కూడా కీలక ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: హ్యారీ బ్రూక్.. ఇంగ్లాండ్‌కు చెందిన యువ ఆటగాడు. ఈసారి ఐపీఎల్లో (IPL 2023) అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)భారీ మొత్తం వెచ్చించి దక్కించుకుంది. మినీ వేలంలో రూ. 13.25 కోట్లతో బ్రూక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు సీజన్లలోనూ లీగ్‌స్టేజ్‌కే పరిమితమై విమర్శలపాలైన ఎస్ఆర్హెచ్ ఈసారి ఎలాగైనా టైటిల్ రేసులో నిలవాలని భావిస్తోంది. అందుకోసం మయాంక్ అగర్వాల్, మార్క్రమ్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్ కూడిన బ్యాటింగ్ విభాగంపై ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ అభిమానుల్లో జోష్ వచ్చేలా ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టీవ్ హర్మిసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 16వ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా హ్యారీ బ్రూక్ నిలుస్తాడని ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డును సొంతం చేసుకుంటాడని వ్యాఖ్యానించాడు.
‘‘ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగుల వీరుడికి ఇచ్చే క్యాప్) పోటీలో హ్యారీ బ్రూక్ ముందుంటాడు. ఎందుకంటే ఇప్పుడు అతడి వద్ద ఆరెంజ్ కిట్ ఉంది కదా. ఈ సీజన్లో అతడే అత్యుత్తమ ఆటగాడిగా ఉంటాడని అనిపిస్తోంది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలుస్తాడు. సిరీస్ ఆసాంతం బ్రూక్ రాణిస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ అద్భుత ఫలితాలను అందుకోవడం ఖాయం’’ అని హార్మిసన్ తెలిపాడు. అయితే, బ్రూక్‌కు టెస్టు క్రికెట్లో నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలను వన్డేలు, టీ20ల్లో మాత్రం గొప్ప ప్రదర్శన లేదు. ఇప్పటి వరకు కేవలం 6 టెస్టులు మాత్రమే ఆడిన బ్రూక్ 10 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు, మూడు అర్ధశతకాలు బాదాడు. ఇంగ్లాండ్ తరఫున 20 టీ20లను ఆడిన బ్రూక్ 372 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 26.57 మాత్రమే ఉన్నా స్ట్రైక్‌రేట్ మాత్రం 140కి దగ్గరగా ఉండటం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్‌లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్‌లో ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్‌కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్‌లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్‌లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్‌లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్‌పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్‌కోచ్‌గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్‌ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్‌పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్‌పేట్‌లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..