Sanju Samson: తుది జట్టులో లేకపోయినా.. మైదానంలో మంచి మనసు చాటుకున్న సంజూ
ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే తుది జట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. అయినా మైదానంలో మంచి మనసు చాటుకుని అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.
ఇంటర్నెట్‌డెస్క్: భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. అయితే ఈ ఘటన ఆటలో భాగం కాకపోయినా.. మైదానంలో చోటుచేసుకున్నదే. అసలేం జరిగిందంటే..
ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్‌లో తుది జట్టులో సంజూకు చోటు దక్కలేదు. అతడి స్థానంలో దీపక్ హూడా జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ మధ్యలో వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది. ఈ సమయంలో మైదానంలో గ్రౌండ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. తీవ్రమైన గాలుల కారణంగా కవర్లు కప్పేందుకు ఇబ్బంది పడ్డారు. వెంటనే మైదానంలోకి వచ్చిన సంజూ వారికి సహాయం చేశాడు. దీనికి సంబందించిన వీడియోను రాజస్థాన్ జట్టు ట్వీట్ చేయగా వైరల్‌గా మారింది. తుది జట్టులోకి తీసుకోకపోయినా.. నీ సహాయంతో అందరి మనసులను గెలుచుకున్నావంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఇక మొదటి వన్డేలో ఆడిన సంజూని రెండో మ్యాచ్‌లో పక్కనపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే తొలి వన్డేలో ఓటమితో వెనకబడ్డ టీమ్‌ఇండియా.. ఈ సిరీస్‌ను సమం చేయాలంటే మూడో వన్డేలో తప్పక గెలవాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Tamilisai: బడ్జెట్‌కు ఇంకా ఆమోదం తెలపని గవర్నర్ తమిళిసై
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Andhra News: జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడిపై హత్యాయత్నం
-
Ap-top-news News
Andhra News: ఇసుక కోసం.. నదిలోనే అడ్డంగా దారి
-
Politics News
Nitish Kumar: కేసీఆర్ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: నీతీశ్‌కుమార్
-
India News
Rahul Gandhi: రాహుల్‌గాంధీతో ‘ఛోటా రాహుల్’!