
Net Run Rate: క్రికెట్‌లో నెట్ రన్‌రేట్‌ను ఎలా లెక్కిస్తారో తెలుసా?
భారత టీ20 లీగ్ చివరి అంకానికి చేరింది. గుజరాత్ 20 పాయింట్లతో ఇప్పటికే తొలి స్థానాన్ని కైవసం చేసుకొని ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక మిగిలిన మూడు స్థానాలకే పోటీ అధికమైంది. ఈ ఉత్కంఠకర పరిస్థితుల్లో ఏయే జట్లు చోటు దక్కించుకుంటాయనేది ఆసక్తిగా మారింది. అయితే.. లఖ్‌నవూ, రాజస్థాన్ ప్రస్తుతం చెరో 16 పాయింట్లతో కొనసాగుతుండగా.. నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది. దీంతో ఈ రెండు జట్లు కూడా దాదాపు ప్లేఆఫ్స్‌లో బెర్తులు సొంతం చేసుకున్నట్లే. ఇక చివరగా మిగిలిన నాలుగో స్థానం కోసమే.. దిల్లీ, బెంగళూరు జట్లు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. వాటితో పాటు కోల్‌కతా, పంజాబ్, హైదరాబాద్ సైతం పోటీలో ఉన్నా అవి అనేక సమీకరణాలపై ఆధారపడి ఉన్నాయి. దీంతో నాలుగో స్థానంలో నిలవాలంటే ఏ జట్టుకైనా నెట్ రన్‌రేట్ కీలకం కానుంది.
నెట్‌రన్‌రేట్ ఎలా కీలకం..?
క్రికెట్‌లో ఏ మెగా టోర్నీలో అయినా నెట్‌రన్‌రేట్ కీలకంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. గ్రూప్ లేదా లీగ్ స్టేజ్‌లో టాప్‌లో నిలిచిన జట్లు తేలిగ్గా నాకౌట్ లేదా ప్లేఆఫ్స్ చేరుకుంటాయి. అయితే, దిగువస్థాయిలో నిలిచే జట్లు ఒక్కోసారి ఇతరులతో సమాన పాయింట్లతో నిలిస్తే.. అప్పుడు నెట్ రన్‌రేట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. అదే ఆయా జట్ల భవిష్యత్‌ను నిర్దేశిస్తుంది. గతేడాది భారత టీ20 లీగ్‌లో.. లీగ్ స్టేజ్ పూర్తయ్యేసరికి కోల్‌కతా, ముంబయి చెరో 14 పాయింట్లు సాధించాయి. అయితే, రన్‌రేట్‌లో కోల్‌కతా (+0.587).. ముంబయి (+0.116) కన్నా కాస్త మెరుగ్గా ఉండటంతో ప్లేఆఫ్స్‌కు చేరింది. అక్కడి నుంచి ఫైనల్‌కు దూసుకెళ్లి త్రుటిలో కప్పు చేజార్చుకుంది. దీన్ని బట్టి నెట్ రన్‌రేట్ ఎంత కీలకమో అర్థమవుతుంది.
ఎలా లెక్కిస్తారు..?
ఉదాహరణకు.. ఒక జట్టు ఏదైనా టోర్నీలో 10 మ్యాచ్‌లు ఆడితే.. అందులో మొత్తం మ్యాచ్‌ల్లో కలిపి ఎన్ని పరుగులు చేసిందో.. దానికి ఎన్ని ఓవర్ల బంతులు ఎదుర్కుందో లెక్కిస్తారు. చివరికి మొత్తం పరుగుల్ని ఎదుర్కొన్న ఓవర్లతో విభజించి సగటు పరుగుల్ని లెక్కిస్తారు. ఆ వచ్చిన మొత్తాన్నే రన్స్ పర్ ఓవర్‌గా నిర్ణయిస్తారు. అలాగే అదే జట్టుపై ఇతర జట్లు ఎన్ని పరుగులు చేస్తాయో.. ఆ జట్లు ఎన్ని ఓవర్లను ఎదుర్కొంటాయో లెక్కిస్తారు. ఒకవేళ ప్రత్యర్థి జట్లు ఆ మ్యాచ్‌లో నిర్దేశించిన ఓవర్లకన్నా తక్కువ ఓవర్లకే ఆలౌటైతే అప్పుడు కూడా వాటిని పూర్తి ఓవర్ల కోటా కిందే లెక్కిస్తారు. ఇక్కడ కూడా సగటు పరుగులు లెక్కిస్తారు. ఆ రెండింటి మధ్య ఉన్న తేడానే నెట్‌రన్‌రేట్.
ఉదాహరణ:
* ఒక టీ20 టోర్నీలో A అనే జట్టు B అనే జట్టుతో తలపడిన మ్యాచ్‌లో 17.2 ఓవర్లలో 180/6 పరుగులు చేసిందని అనుకుందాం..
* అలాగే C అనే జట్టుతో ఆడిన మ్యాచ్‌లో A టీమ్ మొత్తం 20 ఓవర్లలో 145/5 పరుగులు చేసిందని భావిద్దాం..
* ఇక D అనే జట్టుతో ఆడిన మ్యాచ్‌లోనూ A మొత్తం 20 ఓవర్లలో 156/5 పరుగులు చేసిందని తీసుకుందాం..
ఇప్పుడు A అనే జట్టు మొత్తం మూడు మ్యాచ్‌ల్లో కలిపి చేసిన పరుగులు.. 180+145+156= 481.
అలాగే ఎదుర్కొన్న ఓవర్లు కలిపితే.. 17.2+20+20=57.2
ఇప్పుడు మొత్తం చేసిన పరుగుల నుంచి ఆడిన ఓవర్లను తీసుకొని సగటు లెక్కిస్తే రన్ రేట్ పర్ ఓవర్ ఇలా వస్తుంది.. 481/57.2= 8.4090.
* ఇక A జట్టుతో B ఆడిన మ్యాచ్‌లో సాధించిన పరుగులు 20 ఓవర్లలో 179/6 అనుకుందాం..
* అలాగే A జట్టుతో C ఆడిన మ్యాచ్‌లో చేసిన పరుగులు 15.2 ఓవర్లలో 110 ఆలౌటైందని భావిద్దాం..
* ఇక A జట్టుతో D ఆడిన మ్యాచ్‌లో చేసిన పరుగులు 18 ఓవర్లలో 125 ఆలౌటైందని తీసుకుందాం..
ఇక్కడ C, D జట్లు తమకు కేటాయించిన 20 ఓవర్ల కన్నా తక్కువ ఓవర్లలోనే ఆలౌటయ్యాయి. అలాంటప్పుడు రన్‌రేట్‌ను లెక్కించాలంటే.. ఆ పూర్తి ఓవర్ల కోటాతోనే విభజించాలి.
ఇక్కడ కూడా ఇతర జట్లు మొత్తం సాధించిన పరుగులు.. 179+110+125=414
అలాగే ఇతర జట్లు ఆడిన లేదా ఆడాల్సిన ఓవర్లు.. 20+20+20=60
ఇప్పుడు A జట్టుపై మొత్తం ఇతర జట్ల రన్‌రేట్ లెక్కిస్తే.. 414/60=6.9
ఇప్పుడు వచ్చిన రెండు రన్‌రేట్ల మధ్య ఉన్నా తేడా లెక్కిస్తే.. A జట్టు నెట్ రన్‌రేట్ తెలుస్తుంది.. 8.4090-6.9000= +1.509.
-ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana News: తెలంగాణలో మరో 1,663 ఉద్యోగాల భర్తీకి అనుమతి
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs ENG: వర్షంతో ఆటకు అంతరాయం.. ఇంగ్లాండ్ 3 ఓవర్లకు 16/1
-
Politics News
BJP: హైదరాబాద్ డిక్లరేషన్ పేరుతో భాజపా కీలక రాజకీయ తీర్మానం?
-
Business News
Ola Electric: ఈవీ రేస్: నాలుగో స్థానానికి ఓలా.. టాప్‌లో ఎవరంటే?
-
India News
Mohammed Zubair: ఆల్ట్న్యూస్కు పాక్, సిరియా నుంచి విరాళాలు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- నీడనిచ్చి.. జాడ కరవయ్యావు!