Hyderabad vs Bengaluru: హైదరాబాద్‌ ధమాకా.. మళ్లీ రికార్డు బ్రేక్‌

హైదరాబాద్‌ జట్టు తన రికార్డును తానే బద్దలు కొట్టింది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు రాబట్టింది. బెంగళూరుపై 287 పరుగులు చేసింది.

Updated : 15 Apr 2024 21:40 IST

బెంగళూరు: హైదరాబాద్‌ జట్టు తన రికార్డును తానే బ్రేక్ చేసి మరో సంచలనం సృష్టించింది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా మరోసారి రికార్డు నమోదు చేసింది. ఈ సీజన్‌లోనే హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ముంబయిపై 277/3 చేసిన స్కోరును ఇప్పుడు దాటేసింది. తాజాగా బెంగళూరు జట్టుపై 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులతో సత్తాచాటింది.

ఓపెనర్ ట్రావిస్ హెడ్ (102; 41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) వీరవిహారం చేశాడు. వన్‌డౌన్ బ్యాటర్ హెన్రిచ్‌ క్లాసెన్ (67; 31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) సిక్సర్ల వర్షం కురిపించాడు. ట్రావిస్ హెడ్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడుతూ 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడు మరో 19 బంతుల్లో మూడంకెల స్కోరు అందుకున్నాడు. హెన్రిచ్‌ క్లాసెన్ 23 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.  చివర్లో అబ్దుల్ సమద్ (37*; 10 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో హైదరాబాద్‌ రికార్డు స్కోరు సాధించింది. బెంగళూరు బౌలర్లలో ఫెర్గుసన్‌ 2, టాప్లే ఒక వికెట్‌ పడగొట్టారు.

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక టాప్‌ 5 స్కోర్లు ఇవే..

  • హైదరాబాద్‌ 287/3 Vs బెంగళూరు
  • హైదరాబాద్‌ 277/3 Vs ముంబయి
  • కోల్‌కతా 272/7  Vs దిల్లీ
  • బెంగళూరు 263/5 Vs పుణె
  • లఖ్‌నవూ 257/5  Vs పంజాబ్‌
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని