IPL 2024 FINAL - SRH: బలమే.. బలహీనతై

ఓపెనింగ్‌లో హెడ్, అభిషేక్‌ అదరగొడతారు. మధ్య ఓవర్లలో క్లాసెన్‌ చెలరేగుతాడు. మిగతా బ్యాటర్లు సహాయ పాత్ర పోషిస్తే చాలు స్కోరు ఎక్కడికో వెళ్లిపోతుంది. మిగతా పని బౌలర్లు చూసుకుంటారు. ఇదీ ఈ సీజన్లో సన్‌రైజర్స్‌ గెలుపు వ్యూహం.

Published : 27 May 2024 03:31 IST

పెనింగ్‌లో హెడ్ (Travis Head), అభిషేక్‌ (Abhishek Sharma) అదరగొడతారు. మధ్య ఓవర్లలో క్లాసెన్‌ (Heinrich Klaasen) చెలరేగుతాడు. మిగతా బ్యాటర్లు సహాయ పాత్ర పోషిస్తే చాలు స్కోరు ఎక్కడికో వెళ్లిపోతుంది. మిగతా పని బౌలర్లు చూసుకుంటారు. ఇదీ ఈ సీజన్లో (IPL) సన్‌రైజర్స్‌ (Sunrisers Hyderabad) గెలుపు వ్యూహం. అయితే ముగ్గురు నలుగురు బ్యాటర్ల మెరుపులతో ఈ సీజన్లో దూసుకెళ్లిన సన్‌రైజర్స్‌.. మిడిలార్డర్‌ బలహీనతను గుర్తించి సర్దుబాట్లు చేసుకోలేకపోయింది. హెడ్, అభిషేక్‌ మెరుపు ఆరంభాలందిస్తే భారీ స్కోర్లు సాధించిన ఆ జట్టు.. వీళ్లిద్దరూ విఫలమైన మ్యాచ్‌ల్లో తడబడింది. తొలి క్వాలిఫయర్‌లో అలాగే ఓటమి పాలైంది. రెండో క్వాలిఫయర్‌లో అభిషేక్‌ విఫలమైనా హెడ్‌ కాస్త నిలిచాడు. తర్వాత క్లాసెన్‌ అందుకున్నాడు. త్రిపాఠి కూడా తోడ్పాటునందించాడు. కానీ ఫైనల్లో ఓపెనర్లు పూర్తిగా తేలిపోయారు. మిగతా ఇద్దరూ కూడా నిలవలేదు. మొత్తానికి సీజన్‌ అంతటా బలంగా నిలిచిన వాళ్లే.. తుది పోరులో బలహీనతగా మారారు. కష్ట కాలంలో ఆదుకోవాల్సిన మిడిలార్డర్‌ తుస్సుమనిపించింది. దీంతో ఘోర పరాభవంతో సీజన్‌ను ముగించాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు