Hyderabad vs Mumbai: హైదరాబాద్‌ సంచలనం.. ఐపీఎల్‌ రికార్డు బద్దలు

ఐపీఎల్‌లో హైదరాబాద్‌ చరిత్ర సృష్టించింది. టోర్నీ చరిత్రలోనే అత్యధికంగా 277 పరుగులు చేసింది.

Updated : 27 Mar 2024 23:51 IST

హైదరాబాద్‌: ఐపీఎల్‌లో హైదరాబాద్‌ చరిత్ర సృష్టించింది. టోర్నీ చరిత్రలోనే అత్యధికంగా 277 పరుగులు చేసింది. ముంబయితో మ్యాచ్‌లో 3 వికెట్లు కోల్పోయి ఈ ఘనత సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ ఆది నుంచి దూకుడుగా ఆడింది. బ్యాటర్లలో ఒక్క మయాంక్‌ మినహా (11).. ట్రావిస్‌ హెడ్‌ (62), అభిషేక్‌ శర్మ (63), మార్‌క్రమ్‌ (42*), క్లాసెన్‌ (80*) దుమ్మురేపారు. సొంత మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముంబయి బౌలర్లలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, కోయెట్జీ, పీయూష్‌ చావ్లా ఒక్కో వికెట్‌ తీశారు. లక్ష్యఛేదనలో ముంబయి 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులే చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక రికార్డు స్కోర్‌ బెంగళూరు (263)పై ఉంది. 2013లో పుణెపై ఈ స్కోర్‌ని నమోదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని