Naveen-ul-Haq: గ్రౌండ్‌లో కోహ్లీ ఫ్యాన్స్‌ అలా అంటుంటే ఎంజాయ్‌ చేస్తా: నవీనుల్ హక్‌

ఈ సీజన్‌లో లఖ్‌నవూ పేసర్ నవీనుల్ హక్‌, ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి విరాట్ ఫ్యాన్స్‌.. నవీనుల్‌ను చూస్తూ ‘కోహ్లీ.. కోహ్లీ..’ అని నినాదాలు చేస్తున్నారు. దీనిపై నవీనుల్ హక్ (Naveen-ul-Haq) స్పందించాడు.

Published : 26 May 2023 01:39 IST

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ, లఖ్‌నవూ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో  బెంగళూరు స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), లఖ్‌నవూ పేసర్ నవీనుల్ హక్ (Naveen-ul-Haq) మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ ఒకరినొకరు పరోక్షంగా విమర్శించుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ ఘటన జరిగిననప్పటి నుంచి కోహ్లీ ఫ్యాన్స్‌ నవీనుల్ హక్‌ను లక్ష్యంగా చేసుకుని లఖ్‌నవూ మ్యాచ్‌లు జరిగినప్పుడు ‘కోహ్లీ.. కోహ్లీ..’ అని నినాదాలు చేస్తున్నారు. బుధవారం చెన్నైలో లఖ్‌నవూ, ముంబయి ( LSG vs MI) మధ్య మ్యాచ్‌లోనూ నవీనుల్ హక్‌కు ఇదే అనుభవం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో నవీనుల్ హక్‌ మంచి ప్రదర్శనే కనబర్చినప్పటికీ లఖ్‌నవూ ఘోర ఓటమిపాలైంది. 

కోహ్లీ ఫ్యాన్స్‌ అలా నినాదాలు చేస్తుండటంపై ముంబయితో మ్యాచ్‌ అనంతరం నవీనుల్ హక్‌ మాట్లాడాడు. వాళ్లు చేసే నినాదాలను ఆస్వాదిస్తున్నానని, జట్టు కోసం బాగా ఆడేలా ప్రేరేపిస్తాయని చెప్పాడు. ‘‘గ్రౌండ్‌లోని ప్రతి ఒక్కరూ అతని (కోహ్లీ) పేరు లేదా ఏదైనా ఆటగాడి పేరుతో నినాదాలు నాకు ఇష్టం. నేను దానిని ఆస్వాదిస్తాను. నా జట్టుకు బాగా ఆడాలనే ఉత్సాహాన్ని కల్గిస్తాయి. బయటి నుంచి వచ్చే శబ్దాలను పట్టించుకోను. నా ఆటపై మాత్రమే దృష్టి పెడతాను. ప్రేక్షకులు చేసే నినాదాలు నన్ను ప్రభావితం చేయవు. ఆటలో ఇది ఒక భాగం అనుకోవాలి. బాగా ఆడినప్పడు అభిమానులు మనల్ని ప్రశంసిస్తారు. మంచి ప్రదర్శన చేయనప్పుడు విమర్శిస్తారు. క్రీడారంగంలో ఇది ఒక చిన్న భాగం’’ అని నవీనుల్ హక్ అన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని