T20 World Cup: టోర్నీ చరిత్రలోనే అత్యధికం.. టీ20 వరల్డ్‌కప్‌ విన్నర్‌కు ప్రైజ్‌మనీ ఎంతంటే..?

టీ20 ప్రపంచకప్‌ 2024 ప్రైజ్‌మనీని ఐసీసీ ప్రకటించింది.

Published : 04 Jun 2024 00:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ మహా సంగ్రామం ఆరంభమైంది. మొత్తం 20 జట్లు తలపడుతున్న ఈ మెగా టోర్నీలో.. కప్‌ వేటను ఆయా టీమ్‌లు ప్రారంభించాయి. అత్యంత ఆదరణ కలిగిన ఈ టోర్నీ ప్రైజ్‌మనీని తాజాగా ఐసీసీ ప్రకటించింది. టోర్నీ చరిత్రలోనే ఈ సీజన్‌కు అత్యధిక ప్రైజ్‌మనీని కేటాయించడం విశేషం.

  • టీ20 ప్రపంచకప్‌ తొమ్మిదో ఎడిషన్‌ కోసం ఐసీసీ రికార్డు స్థాయిలో 11.25 మిలియన్‌ యూఎస్‌ డాలర్ల ప్రైజ్‌మనీని ప్రకటించింది.
  • ఇందులో విజేతగా నిలిచిన జట్టుకు.. 2.45 మిలియన్‌ డాలర్లు .. రన్నరప్‌ టీమ్‌కు 1.28 మి.డాలర్లు ఇవ్వనున్నారు.
  • 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ కోసం మొత్తం 5.6 మి.డాలర్లు కేటాయించగా.. విజేతగా నిలిచిన ఇంగ్లాండ్‌కు 1.6.మి.డాలర్ల ప్రైజ్‌మనీని అందించారు.
  • ఇక ఈసారి సెమీస్‌ వరకూ వచ్చి ఓడిన జట్లు.. ఒక్కొక్కటి 7,87,500 డాలర్లను అందుకోనున్నాయి.
  • సూపర్‌ 8కు చేరుకుని విఫలమైన నాలుగు జట్లలో..  ఒక్కో జట్టుకు 3,82,500 డాలర్లను ఇవ్వనున్నారు.
  • 9 నుంచి 12వ స్థానంలో నిలిచిన ఒక్కో జట్టు.. 2,47,500 డాలర్లు అందుకోనుంది.
  • 13 నుంచి 20వ స్థానం వరకు నిలిచిన ఒక్కో జట్టుకు 2,25,000 డాలర్లు ఇవ్వనున్నారు.
  • సెమీస్‌, ఫైనల్‌ మినహా.. ఇతర మ్యాచ్‌ల్లో గెలిచిన ప్రతి జట్టుకు 31,154 డాలర్లు అందజేయనున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు