CAN vs IRE: నికోలస్‌ అర్ధశతకం మిస్‌.. ఐర్లాండ్‌ టార్గెట్‌ 138

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెనడా ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.

Updated : 07 Jun 2024 21:53 IST

న్యూయార్క్‌: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూయార్క్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెనడా ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఓపెనర్లు ఆరోన్‌ జాన్సన్ (14), నవనీత్‌ ధలివాల్‌ (6) నిరాశపరిచారు. నికోలస్‌ కిర్టోన్‌ (49) తృటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. పర్‌గత్‌ సింగ్‌ (18), శ్రేయస్‌ మొవ్వ (37) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఐర్లాండ్‌ బౌలర్లలో యంగ్‌, బేరీ మెక్‌గర్తీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. డెలానీ, మార్క్‌ అదైర్‌ తలో వికెట్‌ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని