ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. అగ్రస్థానానికి దూసుకొచ్చిన భారత యువ స్పిన్నర్

టీమ్‌ఇండియా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ (Ravi Bishnoi) టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. 

Updated : 06 Dec 2023 17:03 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో భారత యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ (Ravi Bishnoi) అదరగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టిన అతడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. గత వారం ఐదో స్థానంలో నిలిచిన బిష్ణోయ్‌.. అఫ్గాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (Rashid Khan)ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. వానిందు హసరంగ (శ్రీలంక), ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్), మహీశ్ తీక్షణ (శ్రీలంక) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. 

టీ20ల్లో బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్‌ (Surya Kumar Yadav)  అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్‌) రెండో స్థానంలో, ఐడెన్ మార్‌క్రమ్ (దక్షిణాఫ్రికా) మూడో స్థానంలో ఉన్నారు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో 223 పరుగులు చేసిన రుతురాజ్‌ గైక్వాడ్ (Ruturaj Gaikwad) ఏడో స్థానానికి చేరుకున్నాడు. అతడు ఆసీస్‌తో మూడో టీ20లో సెంచరీ బాదిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్‌ పాండ్య మూడో స్థానంలో ఉన్నాడు. షకీబ్‌ అల్ హసన్ (బంగ్లాదేశ్), మహ్మద్‌ నబీ (అఫ్గానిస్థాన్‌) మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. జట్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. మూడు ఫార్మాట్లలోనూ టీమ్ఇండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు