Rahul Tripathi: విరాట్‌ అందుబాటులో లేకపోతే.. త్రిపాఠి సరైన ప్రత్యామ్నాయం: డీకే

భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ జట్టుకు అందుబాటులో లేని సమయంలో యువ బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి సరైన ప్రత్యామ్నాయమని టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ అభిప్రాయపడ్డాడు.

Published : 03 Feb 2023 23:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ జట్టుకు అందుబాటులో లేని సమయంలో యువ బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి సరైన ప్రత్యామ్నాయమని టీమ్‌ఇండియా క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ అభిప్రాయపడ్డాడు. కివీస్‌తో మూడో టీ20లో రాహుల్‌ అద్భుతంగా రాణించాడని చెప్పాడు. 

‘‘కివీస్‌తో జరిగిన మూడో టీ20, శ్రీలంకతో జరిగిన సిరీస్‌లోనూ రాహుల్ త్రిపాఠి మంచి ప్రదర్శన చేశాడు. ఒకవేళ కోహ్లీ అందుబాటులో లేకపోతే భారత జట్టు తరఫున అతడు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలి. ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉన్నా అతడు రిస్క్‌ తీసుకుంటాడు. దూకుడుగా ఆడతాడు. భారీ షాట్లు బాదుతాడు. అది అతని డీఎన్‌ఏలోనే ఉంది. ఒక కోచ్‌, కెప్టెన్‌కు కావాల్సింది అలాంటి ఆటగాడే. పెద్ద మ్యాచుల్లో భారత జట్టుకు అతడి అవసరం ఉంది. అతడికి పదే పదే అవకాశాలు రావు. కానీ వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోగలడు’’ అని దినేశ్‌ పేర్కొన్నాడు. భారత్‌ - న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ20లో త్రిపాఠి నాలుగు ఫోర్లు మూడు సిక్స్‌లు బాది 22 బంతుల్లో 44 పరుగులు సాధించాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20లో ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాది 16 బంతుల్లో 35 పరుగులు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని