IPL 2023: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్’ ఎవరికి కలిసొచ్చిందంటే?
ఐపీఎల్‌లో (IPL 2023) టాస్ తర్వాత జట్టును ప్రకటించే అవకాశం ఉండటంతోపాటు ఐదుగురితో కూడిన ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాను సమర్పించే పద్ధతి ఉంది. చాలా జట్లు బ్యాటర్లు, బౌలర్లలో అవసరాన్ని బట్టి మార్చుకుంటూ ఫలితాలను అనుకూలంగా రాబట్టేందుకు ప్రయత్నించాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) చరిత్రలో తొలిసారి ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌ను తీసుకొచ్చారు. ప్రతి జట్టూ ఇంపాక్ట్ రూల్‌ను వినియోగించుకుంది. కొన్ని మ్యాచుల్లో అద్భుత ఫలితాలు రాగా.. మరికొన్నింట్లో మాత్రం విఫలమైంది. ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌ను వినియోగించిన తొలి జట్టుగా ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. మరి ఈ సీజన్‌లో ఇలా ఆయా జట్లపై ‘ఇంపాక్ట్’ చూపిన ప్లేయర్ల జాబితాను ఓ సారి పరిశీలిద్దాం.
- చెన్నై సూపర్ కింగ్స్: గుజరాత్ టైటాన్స్‌తో తొలి లీగ్ మ్యాచ్‌లో అంబటి రాయుడి స్థానంలో పేసర్ తుషార్ దేశ్‌పాండేను సీఎస్‌కే ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకుంది. ఆ మ్యాచ్‌లో తుషార్ 3.2 ఓవర్లలో ఒక్క వికెట్ తీసి 51 పరుగులు సమర్పించాడు. ఇలా మొదటి ఇంపాక్ట్ ప్లేయర్ ఘోరంగా విఫలమయ్యాడు. తర్వాత పుంజుకుని తుది జట్టులో కీలక బౌలర్‌గా మారాడు. అప్పటి నుంచి ఇంపాక్ట్‌గా వస్తున్న అంబటి రాయుడు.. చివరి మ్యాచ్‌లో మినహా అన్నింటిలోనూ విఫలమయ్యాడు.
- గుజరాత్ టైటాన్స్: ఆరెంజ్ క్యాప్ హోల్డర్ శుభ్‌మన్ గిల్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఆటగాడే. సెంచరీలతో ప్రత్యర్థుల బౌలింగ్‌ను తుత్తునీయలు చేశాడు. మొదటి లీగ్ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ లీగ్ ఆసాంతం అదే జోరు ప్రదర్శించాడు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన సుదర్శన్ ఓపెనర్ల తర్వాత దూకుడుగా ఆడుతూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అందులో ఫైనల్ మ్యాచ్‌లో 96 పరుగులు చేసి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. గుజరాత్‌కు మాత్రం ఇంపాక్ట్ రూల్ భలేగా కలిసొచ్చింది. మోహిత్ శర్మను కూడా ‘ఇంపాక్ట్’ ఆటగాడిగా వాడుకొని సత్ఫలితాలను అందుకుంది.
- లఖ్‌నవూ సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్య నాయకత్వంలోని లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ వరకు వెళ్లింది. లఖ్‌నవూ కూడా ఆయుష్ బదోని, కృష్ణప్ప గౌతమ్, అవేశ్ ఖాన్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్.. ఇలా ఇంపాక్ట్‌గా ఎంపిక చేసుకుంది. ఆయుష్ బదోని ప్రదర్శన మాత్రం గొప్పగా ఏమీ లేదు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేల్ మేయర్స్ బదులు బౌలింగ్‌కు వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ యశ్ ఠాకూర్ ఉత్తమ ప్రదర్శన ఇచ్చాడు. కీలకమైన మూడు వికెట్లు తీశాడు. అయితే, లఖ్‌నవూ ఎలిమినేటర్‌లోనే ఓడిపోయింది.
- ముంబయి ఇండియన్స్: ముంబయి ఇండియన్స్ ఏకంగా కెప్టెన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకుంది. రోహిత్ శర్మతోపాటు మిస్టర్ 360 బ్యాటర్ సూర్యకుమార్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, నెహాల్ వధెరా ఇంపాక్ట్ ప్లేయర్లుగా బరిలోకి దిగి అదరగొట్టారు. అయితే, రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో కంకేషన్ సబ్‌స్టిట్యూట్‌గా ముంబయి తరఫున బరిలోకి దిగిన విష్ణు వినోద్ మాత్రం ఘోరంగా విఫలం కావడం ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఇషాన్ కిషన్ గాయపడటంతో విష్ణు క్రీజ్‌లోకి వచ్చి సరిగా ఆడలేదు.
- రాజస్థాన్ రాయల్స్: సంజూ నాయకత్వంలోని రాజస్థాన్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌తో మిశ్రమ ఫలితాలను నమోదు చేసింది. హెట్‌మెయిర్ జోరుగా ఆడాడు. ఓబెడ్ మెక్‌కాయ్, రియాన్ పరాగ్, దేవదత్ పడిక్కల్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయారు. భారీగా ఆశలు పెట్టుకున్న రియాన్ పరాగ్ ఈసారి ఘోరంగా విఫలమై జట్టులో స్థానం ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్‌కు గురయ్యాడు. రాజస్థాన్‌కు ఇంపాక్ట్ పెద్దగా కలిసిరాలేదు.
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: గాయం కారణంగా కెప్టెన్ డుప్లెసిస్ కొన్ని మ్యాచుల్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. బ్యాటింగ్‌లో అదరగొట్టేశాడు. ఆర్‌సీబీ ఎక్కువగా బౌలర్ హర్షల్ పటేల్ కోసం ఇంపాక్ట్ రూల్‌ను వాడుకుంది. అనుజ్ రావత్‌తో బ్యాటింగ్ చేయించి హర్షల్‌తో బౌలింగ్ వేయించుకుంది. కానీ, హర్షల్ ఒకటీ రెండు మ్యాచుల్లో మినహా గొప్పగా రాణించలేదు. ప్రత్యర్థులను కట్టడి చేయడంలో విఫలమయ్యాడు.
- కోల్‌కతా నైట్‌రైడర్స్: కేకేఆర్‌కు వెంకటేశ్ అయ్యర్ రూపంలో ఆల్‌రౌండర్ ఉన్నప్పటికీ.. అది బౌలింగ్ ప్రతిభను వాడుకోలేదు. మెరుపు ఇన్నింగ్స్‌లతో అయ్యర్ అలరించాడు. సుయాశ్ శర్మ మ్యాజిక్ స్పెల్‌తో బెంగళూరుపై విజృంభించాడు. ఇక ఆ తర్వాత గొప్ప ప్రదర్శన మాత్రం చేయలేకపోయాడు. వెంకటేశ్, సుయాశ్, అనుకుల్ మధ్యే ఇంపాక్ట్ కుర్చీ తిరిగింది. తొలుత బౌలింగ్ అయితే జట్టులోకి సుయాశ్‌ను తీసుకొని.. కీలక సమయంలో వెంకటేశ్ అయ్యర్‌ను బ్యాటింగ్ దించింది. ఎక్కువ మ్యాచుల్లో ఇంపాక్ట్ రూల్ కోల్‌కతాకు అక్కరకు రాకుండాపోయింది.
- పంజాబ్ కింగ్స్: పంజాబ్ కింగ్స్‌లో రిషి ధావన్‌ను బౌలింగ్ కోసం వినియోగించుకుని.. బ్యాటింగ్‌కు వచ్చేసరికి ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను క్రీజ్‌లోకి తీసుకొచ్చింది. ఇద్దరూ తమ వంతు న్యాయం చేశారు. అలాగే రాహుల్ చాహర్ - భానుక రాజపక్స కూడా జట్టుపై ప్రభావం చూపారు. మిగతా ఆటగాళ్లు సరైన ప్రదర్శన ఇవ్వకపోవడంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో దిగువనే ఉండిపోవాల్సి వచ్చింది.
- దిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్.. వీరిద్దరూ దిల్లీ ప్రధాన జట్టులో ఉండాల్సిన ఆటగాళ్లు. కానీ, కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా అప్పుడప్పుడు వచ్చిపోయారు. పెద్దగా ప్రభావం చూపిన దాఖలాలు అస్సల్లేవు. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజర్ వంటి బౌలర్లు మాత్రం తమ పాత్రకు న్యాయం చేశారు. ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. బ్యాటింగ్ విభాగంలో దిల్లీకి ‘ఇంపాక్ట్’ రూల్ కలిసిరాలేదు.
- సన్‌రైజర్స్ హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన గొప్పగా లేదు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం ఎస్‌ఆర్‌హెచ్‌దే. అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, నటరాజన్, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, కార్తిక్ త్యాగి ‘ఇంపాక్ట్’గా వచ్చారు. వీరిలో అందరూ సింగిల్ షో చేసినవారే అధికం. నిలకడగా నటరాజన్ బౌలింగ్ తప్ప... అన్‌మోల్, రాహుల్, అబ్దుల్ సమద్ జట్టును గెలిపించిన ఇన్నింగ్స్‌లు లేవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
mr pregnant ott release: సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Bhimavaram: భీమవరంలో దారుణం.. ఏడో తరగతి బాలికపై హత్యాచారం
-
HP Chromebooks: గూగుల్‌తో హెచ్‌పీ జట్టు.. భారత్‌లోనే క్రోమ్ బుక్స్ తయారీ
-
Housing sales: జులై- సెప్టెంబరులో రికార్డు స్థాయిలో ఇళ్ల విక్రయాలు: అనరాక్
-
Punjab: వ్యక్తి కడుపులో ఇయర్‌ఫోన్స్, నట్లు, బోల్టులు.. శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు
-
Global Innovation Index: ఇన్నోవేషన్‌లో భారత్‌కు 40వ స్థానం