IND vs BAN: బుమ్రా లేకపోయినా.. ఆ ఆటగాడి నుంచి బంగ్లాకు పెద్ద ముప్పు: హెచ్చరించిన మాజీ

Eenadu icon
By Sports News Team Published : 17 Feb 2025 14:48 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఛాంపియన్స్‌ ట్రోఫీ (ICC Champions Trophy 2025) లో బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడేందుకు టీమ్‌ ఇండియా (Team India) సిద్ధమవుతోంది. దుబాయ్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ (IND vs BAN) కోసం అటు బంగ్లా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దుబాయ్‌ చేరుకున్న టీమ్‌ఇండియా ప్రాక్టీస్‌పై దృష్టిపెట్టింది. ఈ మ్యాచ్‌పై బంగ్లా మాజీ ఓపెనర్‌ ఇమ్రూల్‌ కయేస్‌ స్పందించాడు.

స్టార్‌ పేసర్‌ బుమ్రా (Jasprit Bumrah) టీమ్‌ఇండియా జట్టులో లేకపోవడాన్ని సద్వినియోగం చేసుకోవాలని బంగ్లా జట్టుకు సూచించాడు. మరోవైపు బుమ్రా లేకపోయినా.. మరో రూపంలో ముప్పు పొంచి ఉందని జట్టును హెచ్చరించాడు. ‘‘టీమ్‌ఇండియా ఎంతో బలమైన జట్టు. దాని బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలు ఎంతో పటిష్టంగా ఉన్నాయి. అయితే.. జట్టులో బుమ్రా లేడు. అతడు గత రెండేళ్లలో టీమ్‌ఇండియాకు ఎంత గొప్ప ప్రదర్శన చేశాడో చూశాం. అతడు లేకపోవడం బంగ్లా జట్టుకు కలిసొచ్చే విషయమే’’

‘‘బుమ్రా లేకపోయినా.. ఆ జట్టులో మహమ్మద్‌ షమీ, హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్‌ ఉన్నారు. షమీ జట్టులోకి రావడం పెద్ద పరిణామం. అతడు ప్రస్తుతం ఫిట్‌నెస్‌తో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అయితే.. ఒక్కసారి బంతితో లయను అందుకుంటే, అతడు బంగ్లాకు పెద్ద ముప్పుగా మారతాడు’’ అని జట్టు సభ్యులను ఇమ్రుల్‌ హెచ్చరించాడు.

ఇక బంగ్లా జట్టులో వెటరన్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ లేకపోవడం ఇబ్బందికర విషయమేనని ఇమ్రుల్‌ అంగీకరించాడు. ‘‘షకీబ్‌ గొప్ప ఆటగాడు. అతడిని మేం మిస్‌ అవుతున్నాం. ఏ మ్యాచ్‌లోనైనా అతడు ప్రభావం చూపిస్తాడు’’ అని పేర్కొన్నాడు. 

దుబాయ్‌ వేదికగా భారత్‌-బంగ్లా మధ్య తొలి మ్యాచ్‌ ఈ నెల 20న జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారతే ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌ (IND vs PAK) తో భారత్‌ 23న తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు