IPL 2024 - WPL 2024: ఐపీఎల్‌ - డబ్ల్యూపీఎల్‌ ఫైనల్స్‌.. ఈ పోలికలను గమనించారా?

ఐపీఎల్‌ 2024 ప్రారంభానికి ముందు డబ్ల్యూపీఎల్‌ జరిగిన సంగతి తెలిసిందే. అందులో విజేతగా ఆర్సీబీ వుమెన్ జట్టు నిలిచింది. ఇప్పుడు ఐపీఎల్‌లో కేకేఆర్ ఛాంపియన్‌. ఈ రెండింటి మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయి.

Published : 27 May 2024 16:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఒకటి. బీసీసీఐ ఆధ్వర్యంలో 17 సీజన్ల నుంచి దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈసారి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచి మూడోసారి కప్‌ను సొంతం చేసుకుంది. బీసీసీఐ మరొక టోర్నీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మహిళల కోసం ‘వుమెన్ ప్రీమియర్‌ లీగ్’ను (WPL) గతేడాది నుంచి ప్రారంభించింది. ఈ సీజన్‌ విజేతగా రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు వుమెన్ జట్టు నిలిచింది. అయితే, ఇప్పుడీ కేకేఆర్ విజయానికి.. అప్పుడు ఆర్సీబీడబ్ల్యూ టీమ్‌ గెలుపు మధ్య కొన్ని ఆసక్తికర పోలికలు నెట్టింట వైరల్‌గా మారాయి. అవేంటో ఓ లుక్కేద్దాం..

  • డబ్ల్యూపీఎల్ ఫైనల్‌లో దిల్లీ క్యాపిటల్స్ - ఆర్సీబీ డబ్ల్యూ తలపడ్డాయి. డీసీని ఆసీస్‌ ప్లేయర్ మెగ్‌ లానింగ్‌ నడిపించగా.. ఆర్సీబీకి భారత స్టార్‌ స్మృతీ మంధాన కెప్టెన్సీ చేసింది. 
  • ఐపీఎల్‌ ఫైనల్‌లో సన్‌రైజర్స్‌కు ఆసీస్ స్టార్ ఆటగాడు పాట్ కమిన్స్‌ నాయకత్వం వహించగా.. కోల్‌కతాకు భారత ప్లేయర్ శ్రేయస్‌ అయ్యర్ కెప్టెన్‌గా ఉన్నాడు.
  • డబ్ల్యూపీఎల్‌లో టాస్‌ నెగ్గిన దిల్లీ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఐపీఎల్‌లోనూ ఎస్‌ఆర్‌హెచ్‌ అదే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 
  • మొదట బ్యాటింగ్‌ చేసిన దిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. ఇక ఐపీఎల్‌లో హైదరాబాద్‌ కూడా సరిగ్గా అవే పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ముగించింది. 
  • డబ్ల్యూపీఎల్‌లో దిల్లీ నిర్దేశించిన లక్ష్యాన్ని బెంగళూరు కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. IPL 2024లో కేకేఆర్‌ కూడా 8 వికెట్ల తేడాతో గెలిచింది. 
  • ఐపీఎల్‌ ఫైనల్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఆసీస్‌ క్రికెటర్‌ మిచెల్ స్టార్క్‌ అందుకోగా.. WPL 2024లోనూ ఆసీస్‌ ప్లేయర్‌ సోఫీ మోలినెక్స్‌ దక్కించుకోవడం గమనార్హం. 
  • రెండు టోర్నీల్లోనూ భారత జట్టుకు చెందిన ప్లేయర్లే కెప్టెన్‌గా ఉన్న టీమ్‌లు టైటిల్‌ను అందుకున్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని