Team India: కివీస్‌పై వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్.. వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన టీమ్‌ఇండియా
కివీస్‌పై వన్డే సిరీస్‌ని 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 386 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 41.2 ఓవర్లలో 295 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని భారత్ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. కివీస్‌పై సిరీస్‌ని క్లీన్‌స్వీప్ చేసిన టీమ్‌ఇండియా వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం 114 రేటింగ్స్ పాయింట్లతో భారత్ తొలి స్థానంలో ఉండగా.. 113 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా (112), న్యూజిలాండ్ (111), పాకిస్థాన్ (106) రేటింగ్ పాయింట్లతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
టీ20 ర్యాంకింగ్స్‌లోనూ టీమ్‌ఇండియా అగ్రస్థానంలో ఉంది. 276 రేటింగ్ పాయింట్లతో భారత్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. 266 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్ (258), సౌతాఫ్రికా (256), న్యూజిలాండ్ (252) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక, భారత్, న్యూజిలాండ్ మధ్య జనవరి 27 నుంచి మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభంకానుంది. జనవరి 27న తొలి టీ20, 29న రెండో టీ20, ఫిబ్రవరి 1న మూడో టీ20 జరగనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27/01/2023)
-
World News
Handsome Man: శాస్త్రీయంగా ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే?
-
India News
Arvind Kejriwal: చర్చలకు పిలిచిన సక్సేనా.. నో చెప్పిన కేజ్రీవాల్
-
Technology News
Cola Phone: కోకాకోలా కొత్త స్మార్ట్‌ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
-
Movies News
Haripriya: ఒక్కటైన ‘కేజీయఫ్’ నటుడు, ‘పిల్ల జమీందార్’ నటి
-
World News
Pakistan: పాక్ సంక్షోభం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి