IND vs AUS: డబ్ల్యూటీసీ ఫైనల్‌.. భారత్‌కే ఎక్కువ అవకాశాలు: ఆసీస్‌ మాజీ కెప్టెన్

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ (WTC Final) ఫైనల్‌కూ దూసుకెళ్లింది. 

Published : 17 Mar 2023 19:44 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జూన్ 7నుంచి 11వ తేదీ వరకు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC Final 2023) ఫైనల్‌ జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా అడుగుపెట్టిన పెట్టాయి. గత సీజన్‌ (2021) ఫైనల్‌లో కివీస్‌ చేతిలో టీమ్‌ఇండియా ఓడిన విషయం తెలిసిందే. అందుకే, లండన్‌ వేదికగా జరిగే ఈసారి ఫైనల్‌లో కచ్చితంగా గెలవాలని భారత్‌ అభిమానులు ఆశిస్తున్నారు. ఇంకా మూడు నెలల సమయం ఉంది. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్‌ జరుగుతోంది. అయితే, ఈసారి ఫైనల్‌లో భారత్‌కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని ఆసీస్‌ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ వ్యాఖ్యానించాడు. 

‘‘హార్దిక్‌ పాండ్య టెస్టు ప్రణాళిక ఏంటో నాకైతే తెలియదు. కానీ షమీ, ఉమేశ్‌, సిరాజ్‌ మాత్రం సూపర్బ్‌. వారంతా అద్భుతమైన ఫాస్ట్‌బౌలర్లు. ప్రస్తుతం సిరాజ్‌ టాప్‌ బౌలర్‌గా ఎదుగుతున్నాడు. గతంలో ఇంగ్లాండ్‌లోనే ఇంగ్లాండ్‌ను ఓడించారు. అందుకే, భారత్‌కే ఈసారి ఫైనల్‌లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది. ఆసీస్‌పై బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. దిల్లీ టెస్టులో కేవలం గంట ఆటతోనే మ్యాచ్‌ను వారివైపు తిప్పేసుకుంది. ఈ సిరీస్‌ను వారు గెలవడానికి పూర్తిగా అర్హులు’’ అని ఫించ్‌ చెప్పాడు. 

గాయంతో భారత్‌తో టెస్టు సిరీస్ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన డేవిడ్‌ వార్నర్‌పై (David Warner) ఫించ్‌ ప్రశంసలు కురిపించాడు. మూడుఫార్మాట్లలోనూ ఆసీస్‌ తరఫున అత్యుత్తమ ఆటగాడు అతడేనని కొనియాడాడు. ‘‘భారత్‌తో సిరీస్‌లో గొప్పగా రాణించలేదు. కానీ, ఇప్పటికీ ఆసీస్‌ తరఫున అన్ని ఫార్మాట్లలోనూ వార్నర్‌ అత్యుత్తమ బ్యాటర్. తప్పకుండా ఫామ్‌లోకి వచ్చి విజృంభిస్తాడు’’ అని తెలిపాడు. భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైన వార్నర్.. తొలి వన్డే కోసం ఎంపిక చేసిన తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని