BAN vs IND: బంగ్లాదేశ్ పర్యటనకు భారత్.. షెడ్యూల్ ఇదే.. లైవ్ స్ట్రీమింగ్ ఎలాగంటే?
పసి కూన బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్టులను భారత్ ఆడనుంది. ఆదివారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, షమీ తదితరులు జట్టులోకి వచ్చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ తర్వాత వరుసగా మ్యాచ్‌లతో టీమ్‌ఇండియా బిజీబిజీగా గడిపేస్తోంది. కివీస్ పర్యటన ముగియడంతో మరో సిరీస్ కోసం బంగ్లాదేశ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. బంగ్లాతో మూడు వన్డేలు, రెండు టెస్టులను భారత్ ఆడనుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమ్‌ఇండియా బరిలోకి దిగబోతోంది. భారత ఆటగాళ్లు ఇవాళ ఢాకాకు చేరుకొంటారు. వన్డే సిరీస్‌కు టీమ్‌ను ప్రకటించిన బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ కోసం మాత్రం ఇంకా ప్రకటించలేదు.
సిరీస్ ఎప్పుడు.. వీక్షించేది ఎలా..?
బంగ్లాదేశ్‌తో తొలుత మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఆడనుంది. ఆ తర్వాత రెండు టెస్టుల్లో తలపడనుంది. మ్యాచ్‌లను డిస్నీ+హాట్‌స్టార్‌తోపాటు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించే అవకాశం ఉంది. వన్డేలన్నీ ఉదయం 11.30 గంటలకు ప్రారంభమవుతాయి. టెస్టులు ఉదయం 9 గంటలకు మొదలుకానున్నాయి.
వన్డే సిరీస్ ఇలా..
* మొదటి వన్డే: డిసెంబర్ 4, ఢాకా
* రెండో వన్డే: డిసెంబర్ 7, ఢాకా
* మూడో వన్డే: డిసెంబర్ 10, చిట్టగాంగ్
టెస్టు సిరీస్..
* తొలి టెస్టు మ్యాచ్: డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 18 వరకు
* రెండో టెస్టు మ్యాచ్: డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 26 వరకు
విరాట్ వచ్చేస్తున్నాడు..
మెగా టోర్నీ ముగిశాక న్యూజిలాండ్ పర్యటనకు విశ్రాంతి తీసుకొన్న సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ వచ్చేస్తున్నారు. అయితే పంత్‌తో పాటు వికెట్ కీపర్ల జాబితాలోకి ఇషాన్ కిషన్‌కు అవకాశం దక్కింది. సంజూ శాంసన్‌కు చోటు కల్పించలేదు. రవీంద్ర జడేజా ఉన్నప్పటికీ.. ఫిట్‌నెస్ సాధించాల్సి ఉంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో బుమ్రాను బీసీసీఐ ఎంపిక చేయలేదు. వన్డే సిరీస్‌కు సంబంధించి తుది జట్టులో స్థానంపై తీవ్ర పోటీ ఉంది.
వన్డే సిరీస్ కోసం జట్లివే:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్‌కోహ్లీ, రజత్ పటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, యశ్ దయాళ్.
బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ షాంటో, యాసిర్ అలీ, షకిబ్ అల్ హసన్, మహముదుల్లా, మెహిదీ హసన్ మిరాజ్, అఫిఫ్ హొస్సేన్ ధ్రుబో, ఎబాడట్ హొస్సేన్, అనముల్ హక్, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీం, నురుల్ హసన్, హసన్ మహముద్, ముస్తాఫిజర్ రహ్మాన్, నసుమ్ అహ్మద్
టెస్టు సిరీస్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్‌యాదవ్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
బడ్జెట్ అంశాలు లీకవడంతో.. పదవిని కోల్పోయిన ఆర్థిక మంత్రి
-
Sports News
Hanuma Vihari: విహారి ఒంటి చేత్తో.. మణికట్టు విరిగినా బ్యాటింగ్
-
Ts-top-news News
Samathamurthy: నేటి నుంచి సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు
-
Crime News
Crime News: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. తెదేపా మండలాధ్యక్షుడికి గాయాలు
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!