IND vs BAN: రిషభ్‌ పంత్‌ అర్ధశతకం.. బంగ్లాదేశ్‌ టార్గెట్‌ 183

న్యూయార్క్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

Updated : 01 Jun 2024 21:55 IST

న్యూయార్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూయార్క్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ ఇండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (53) అర్ధశతకం పూర్తి చేసుకున్న తర్వాత రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిగాడు.  

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (23)తో కలిసి ఓపెనింగ్‌ చేసిన శాంసన్‌ (1) నిరాశ పరిచాడు. ఇస్లాం వేసిన 1.5వ బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలి డౌన్‌లో వచ్చిన రిషభ్‌తో కలిసి రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేశాడు. క్రీజులో నిలదొక్కుకుంటున్న ఈ జోడీని మహ్మదుల్లా విడగొట్టాడు. జట్టు స్కోరు 59 పరుగుల వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్‌.. రిషద్‌ హుస్సాయిన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ (31), శివం దుబే (14) ఫర్వాలేదనిపించారు. హార్దిక్‌ పాండ్య (40*), రవీంద్ర జడేజా  (4*) నాటౌట్‌గా నిలిచారు. బంగ్లా బౌలర్లలో మహేది హసన్‌, ఇస్లాం, మహ్మదుల్లా, తన్వీర్‌ తలో వికెట్‌ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని