India vs New Zealand: శతక్కొట్టిన మిచెల్‌.. అదరగొట్టిన షమీ.. భారత్‌ లక్ష్యం.. 274

India vs New Zealand: ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో కివీస్‌ జట్టు 274 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ముందుంచింది.

Updated : 22 Oct 2023 18:08 IST

ధర్మశాల: ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్‌ అయింది. డారిల్ మిచెల్ (130; 127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకం బాదాడు. రచిన్ రవీంద్ర (75; 87 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా భారీ ఇన్సింగ్స్ ఆడాడు. గ్లెన్ ఫిలిప్స్ (23), విల్ యంగ్ (17) పరుగులు చేయగా.. డేవాన్ కాన్వే (0), టామ్ లేథమ్ (5), మార్క్ చాప్‌మన్ (6), మిచెల్ శాంట్నర్ (1), హెన్రీ (0), ఫెర్గూసన్‌ (1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ట్రెంట్‌ బౌల్డ్‌ (0*) నాటౌట్‌గా నిలిచాడు.

ఓపెనర్లు డేవాన్ కాన్వే, విల్ యంగ్ వెనుదిరగడంతో 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కివీస్‌ను రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ ఆదుకున్నారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ మూడో వికెట్‌కు 159 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారీ స్కోరు దిశగా సాగుతున్న న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ను మహ్మద్‌ షమీ దెబ్బ తీశాడు. ప్రమాదకరంగా మారిన మిచెల్‌, రవీంద్ర జోడీని విడదీశాడు. అంతేకాదు ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక మిగిలిన బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్ రెండు వికెట్లు తీయగా, బూమ్రా, సిరాజ్‌లకు చెరో వికెట్‌ దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని