Team India: 2024.. టీమ్‌ఇండియా మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..!

2024లో భారత జట్టు (Team India) ఏయే సిరీస్‌ల్లో ఎవరెవరితో తలపడనుందో ఓ లుక్కేద్దాం..

Updated : 01 Jan 2024 08:25 IST

ఇంటర్నెట్ డెస్క్: మనం కొత్త సంవత్సరం (2024)లోకి వచ్చేశాం. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌, డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఎదురైన పరాభవాల నుంచి పాఠాలు నేర్చుకొంటూ న్యూ ఇయర్‌లోకి నూతనోత్సాహంతో అడుగుపెడుతోంది టీమ్‌ఇండియా(Team India). 2024 జూన్‌లో యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈసారి ఎలాగైనా పొట్టికప్పును సొంతం చేసుకోవాలని టీమ్‌ఇండియా గట్టిపట్టుదలతో ఉంది. ఇదిలా ఉండగా.. 2024లో భారత జట్టు ఏయే సిరీస్‌ల్లో ఎవరెవరితో తలపడనుందో ఓ లుక్కేద్దామా..! 

జనవరి 03- 07 వరకు.. సౌతాఫ్రికాతో రెండో టెస్టు (కేప్‌టౌన్‌)

అఫ్గాన్‌తో 3 టీ20ల సిరీస్

  • జనవరి 11: తొలి టీ20 మొహలీ

  • జనవరి 14: రెండో టీ20 ఇండోర్

  • జనవరి 17: మూడో టీ20 బెంగళూరు

ఇంగ్లాండ్‌ భారత పర్యటన.. 5 టెస్టులు

  • జనవరి: 25-29 తొలి టెస్టు - హైదరాబాద్‌

  • ఫిబ్రవరి: 02-06 రెండో టెస్టు - విశాఖపట్నం

  • ఫిబ్రవరి: 15-19 మూడో టెస్టు - రాజ్‌కోట్ 

  • ఫిబ్రవరి: 23-27 నాలుగో టెస్టు - రాంచీ

  • మార్చి: 07-11 ఐదో టెస్టు - ధర్మశాల

ఏప్రిల్‌- మే: ఐపీఎల్‌ కారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు విరామం

  • జూన్‌: టీ20 ప్రపంచకప్‌ (వెస్టిండీస్‌, యూఎస్‌ఏలో)
  • జులైలో టీమ్‌ఇండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, 3 టీ20లు ఆడనుంది.
  • సెప్టెంబరులో భారత జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, మూడు టీ20ల్లో తలపడనుంది.
  • అక్టోబర్‌లో భారత్ వేదికగా టీమ్‌ఇండియా, న్యూజిలాండ్ మూడు టెస్టులు ఆడతాయి.
  • నవంబర్‌, డిసెంబరులో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆడనుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని