Women's World Cup Final: అంబరాన్ని అంటిన సంబరాలు

Eenadu icon
By Sports News Desk Updated : 04 Nov 2025 02:49 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

నవీ ముంబయి: దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో వన్డే ప్రపంచకప్‌ అందుకున్న భారత్‌.. ఆదివారం రాత్రంతా సంబరాలు చేసుకుంది. ‘‘మువ్వన్నెల జెండా.. ఉవ్వెత్తున ఎగిరింది. మన టీమ్‌ఇండియా.. మన టీమ్‌ఇండియా’ అనే థీమ్‌ సాంగ్‌తో స్టేడియం మార్మోగింది. జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది, క్రీడాకారుల కుటుంబ సభ్యులు ఈ పాటను పాడుతూ విజయాన్ని ఆస్వాదించారు. నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత చాలా గంటల పాటు భారత జట్టు మైదానంలోనే గడిపింది. కప్పుతో వారి సంబరాలు అంబరాన్నంటాయి. అంతకుముందు ఫైనల్లో ఓడి తీవ్ర నిరాశలో ఉన్న దక్షిణాఫ్రికా ప్లేయర్లను భారత అమ్మాయిలు ఓదార్చారు. హోటల్‌కు వెళ్లేముందు స్టేడియం బయట భారీగా ఉన్న అభిమానులతో భారత అమ్మాయిలు ఫొటోలు దిగారు. హోటల్‌కు వెళ్లాక ప్రపంచకప్‌తో నిద్రిస్తున్నట్లుగా హర్మన్‌ప్రీత్, స్మృతి, జెమీమా ఫొటోలు తీసుకున్నారు.


‘‘ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ గెలిచి నందుకు భారత జట్టులోని ప్రతి సభ్యురాలికి నా అభినందనలు. తొలిసారి కప్పు నెగ్గడం ద్వారా వాళ్లు చరిత్ర సృష్టించారు. ఈ గొప్ప విజయం మహిళల క్రికెట్లో ఇంకా అత్యుత్తమ ప్రదర్శనలకు దారితీస్తుంది’’

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము


‘‘మన క్రికెట్‌ జట్టు విజయానికి భారతదేశమంతా ఎంతో సంతోషిస్తోంది. భారత్‌కు ఇది తొలి మహిళల ప్రపంచకప్‌. మహిళల క్రికెట్‌ జట్టుకు నా అభినందనలు. మీ విజయం దేశంలో కోట్లాది యువతకు ప్రేరణనిస్తుంది’’

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 


క్రికెట్‌ అందరిదీ.. 

ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. ఓ బలమైన సందేశాన్నిచ్చింది. క్రికెట్‌ కేవలం పురుషులదే కాదని, ఆట అందరిదని చెప్పింది. ‘‘క్రికెట్‌ ఈజ్‌ ఎ జెంటిల్‌మన్స్‌ ఎవ్రివన్స్‌ గేమ్‌’’ అని రాసి.. ‘జెంటిల్‌మన్స్‌’ అన్నది కొట్టివేసి ఉన్న టీషర్ట్‌ను హర్మన్‌ ధరించింది. ఆ చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. 


‘‘ఇది ఆరంభం మాత్రమే. మేం అడ్డంకిని అధిగమించాలనుకున్నాం. ఇకపై విజయాన్ని అలవాటుగా మార్చుకోవాలన్నది మా ప్రణాళిక. మేం ఎదురుచూసిన క్షణం వచ్చింది. ముందు ముందు ఇలాంటి సందర్భాలు చాలా వస్తాయి. మేం మెరుగుపడుతూనే ఉండాలనుకుంటున్నాం. ఇది అంతం కాదు.. ఆరంభం’’ 

 హర్మన్‌ప్రీత్‌ 


దిగ్గజాల చేతిలో కలల కప్పు

ప్రపంచకప్‌ ట్రోఫీతో జులన్‌ గోస్వామి, మిథాలి రాజ్‌

 

Tags :
Published : 04 Nov 2025 02:42 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు