IND vs NZ: భారత్‌- న్యూజిలాండ్‌ సిరీస్‌: జట్లు, తేదీలు, వేదికలు, స్ట్రీమింగ్‌ వివరాలు ఇవే!

టీ20 ప్రపంచకప్‌లో వైఫల్యం చెందిన టీమ్‌ఇండియా.. న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు సిద్ధమవుతోంది. నవంబర్ 18 నుంచి మూడు టీ20ల సిరీస్‌తో భారత్‌ పర్యటన ప్రారంభం కానుంది.

Updated : 17 Nov 2022 17:45 IST

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లోనే వెనుదిరిగిన టీమ్‌ఇండియా మరో నాలుగు రోజుల్లో న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లను (Ind vs Nz Series) ఆడేందుకు సిద్ధమైంది. ఇప్పటికే భారత జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20 జట్టుకు హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) నాయకత్వం వహిస్తాడు. అలాగే వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్‌ (Shikar Dhawan) కెప్టెన్‌గా ఉంటాడు. సీనియర్లు రోహిత్, విరాట్ కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. యువ బౌలర్లు ఉమ్రాన్‌ మలిక్, కుల్‌దీప్‌ సేన్‌కు అవకాశం దక్కింది. అలాగే 13 మందితో కూడిన న్యూజిలాండ్ జట్టును ప్రకటించింది.

టీ20 సిరీస్‌ ఇలా.. 

తొలి టీ20: నవంబర్ 18, వేదిక: వెల్లింగ్టన్ 

రెండో టీ20: నవంబర్ 20, వేదిక: బే ఓవల్‌, మౌంట్ మాంగనుయ్‌

మూడో టీ20: నవంబర్ 22, వేదిక: మెక్‌లీన్‌ పార్క్, నేపియర్‌

టీ20 జట్టు: 

హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), రిషభ్‌పంత్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్య కుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, హర్షల్‌ పటేల్‌, మహమ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్ మాలిక్‌. 

వన్డే సిరీస్‌...

మొదటి వన్డే: నవంబర్ 25, వేదిక: ఈడెన్ పార్క్, ఆక్లాండ్‌ 

రెండో వన్డే: నవంబర్ 27, వేదిక: సెడాన్ పార్క్, హామిల్టన్ 

మూడో వన్డే: నవంబర్ 30, వేదిక: హాగ్లే ఓవల్, క్రైస్ట్‌ చర్చ్

వన్డే జట్టు: 

శిఖర్‌ ధావన్‌(కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌ (వైస్‌ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), శుభ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్య కుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, షాబాజ్‌ అహ్మద్‌, యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, దీపక్‌ చాహర్‌, కుల్‌దీప్‌ సేన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌. 

న్యూజిలాండ్‌ జట్టు ఇదే..

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్‌ అలెన్, మైకెల్ బ్రాస్‌వెల్, డేవన్‌ కాన్వే, లాకీ ఫెర్గూసన్, డారిల్‌ మిచెల్‌, ఆడమ్ మిల్నే, గ్లెన్ ఫిలిప్స్‌, జిమ్మీ నీషమ్, మిచెల్‌ సాంట్నర్, టిమ్‌ సౌథీ, బ్లెయిర్ టిక్నర్, ఐష్‌ సోధి

స్ట్రీమింగ్‌ వివరాలు: 

  • మూడు టీ20లు మన కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతాయి. 
  • మూడు వన్డేలు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయి.
  • భారత్‌ - న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌లను టీవీల్లో డీడీ స్పోర్ట్స్‌లోను, ఓటీటీల్లో అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రత్యక్షంగా వీక్షించొచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని