Kuldeep Yadav: స్విగ్గీ కస్టమర్‌ ప్రశ్నకు కుల్‌దీప్‌ ఫన్నీ రెస్పాన్స్‌.. నెట్టింట వైరల్‌!

వరల్డ్ కప్‌ సన్నాహాల్లో ఉన్న కుల్‌దీప్‌ యాదవ్ (Kuldeep Yadav) నెట్టింట ఒక్కసారిగా వైరల్‌గా మారిపోయాడు. దానికి కారణం ఓ యూజర్ చేసిన పోస్టు.. 

Published : 15 Nov 2023 13:04 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) తొలి సెమీస్‌ కోసం భారత స్టార్‌ స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్ సన్నద్ధమవుతున్నాడు. అయితే, అతడు ఓ ప్రశ్నకు స్పందించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. దీంతో నెట్టింట వైరల్‌గా మారిపోయాడు. ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీలో ఓ కస్టమర్‌ ఏదో ఆర్డర్ చేయగా.. దానికి సదరు యాప్ కస్టమర్‌ కేర్‌ స్పందించింది. ‘మీ ఆర్డర్‌ సిద్ధంగా ఉంది. కుల్‌దీప్‌ యాదవ్‌ దారిలో ఉన్నారు. తొమ్మిది నిమిషాల్లో చేరుతుంది’ అని సమాధానం ఇచ్చింది. దీంతో ఆ యూజర్‌ తన ట్విటర్‌లో స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేస్తూ.. ‘‘కుల్‌దీప్‌ పిచ్‌ బయట కూడా డెలివరీ చేస్తున్నావా?’’ అని కుల్‌దీప్‌ను ట్యాగ్‌ చేశాడు. దీనికి కుల్‌దీప్ ఫన్నీగా స్పందించాడు. ‘‘ఇంతకీ నువ్వేం ఆర్డర్‌ చేశావు? బ్రదర్’’ అని పోస్టు పెట్టాడు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ఇప్పటికే ఆ పోస్టుకు 1.6 మిలియన్ల వ్యూస్‌ రాగా.. 23 వేల లైకులు వచ్చాయి.

‘‘భారత్ గెలవాలి. ఇదే మేం కుల్‌దీప్‌ నుంచి కోరుకునేది. ఇప్పటికే చాలాసార్లు గెలిపించావు’’ 

‘‘న్యూజిలాండ్‌ బ్యాటర్ల భరతం పట్టేయ్. ఐదు వికెట్ల ప్రదర్శన కావాలి’’

‘‘అతడు వరల్డ్‌ కప్‌ను ఆర్డర్‌ చేశాడు. తప్పకుండా డెలివరీ చేస్తావని ఆశిస్తున్నా’’

‘‘హ్యాట్రిక్‌ ఆర్డర్‌ చేశాం భయ్యా. త్వరగా ఇచ్చేయాలి’’

‘‘కేన్ విలియమ్సన్, మిచెల్ డారిల్ వికెట్లు కావాలి కుల్‌దీప్‌.. అలాగే ఇంకాస్త ఫాస్ట్‌గా (117 కి.మీ వేగంతో) డెలివరీ చేయగలవా?’’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు