IPL 2023 : ఈ ఐపీఎల్‌ టోర్నీలో ప్రకటనల పంట.. ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందంటే?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టోర్నీలో ఒకటి ఐపీఎల్‌(IPL). ప్రతీ సీజన్‌కు ప్రేక్షకాదరణతోపాటు ప్రకటనల ఆదాయాన్ని పెంచుకుంటూ ఇది ముందుకు సాగుతోంది.

Published : 05 Jul 2023 17:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2023(IPL 2023) సీజన్‌ క్రీడాభిమానులకు ఎన్నో మధురస్మృతులను మిగిల్చింది. ఎంఎస్‌ ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు ఐదోసారి విజేతగా నిలిచి ముంబయి రికార్డును సమం చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టోర్నీల్లో ఒకటైన ఐపీఎల్‌.. అటు ప్రకటనల రూపంలోనూ భారీ ఆదాయాన్ని సాధించి పెట్టింది. ₹10,120 కోట్ల యాడ్‌ రెవెన్యూ వచ్చినట్లు మార్కెట్‌ రిసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ సంస్థ ‘రెడ్‌సీర్‌ స్ట్రాటజీ కన్సల్టెంట్స్‌’ తెలిపింది. ప్రకటనల ఆదాయంలో ఇది గణనీయమైన వృద్ధి అని పేర్కొంది.

ఆ కంపెనీ నివేదిక ప్రకారం.. 

  • ప్రసార హక్కులు పొందిన జియోసినిమా, స్టార్‌ స్పోర్ట్స్‌ మొత్తం ₹4700 కోట్లు ప్రకటనల రూపంలో ఆదాయం పొందాయి.
  • ఇక ఫ్రాంచైజీలు ₹1450 కోట్లు యాడ్‌ల ద్వారా సమకూర్చుకోగా.. బీసీసీఐకి మరో ₹430 కోట్లు వచ్చాయి.
  • మొత్తం ఆదాయంలో 65 శాతం బీసీసీఐ, ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్ల ద్వారానే ప్రత్యక్షంగా వచ్చింది.
  • మిగతా 35 శాతం సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ఇతర మీడియా, ఇంటర్నెట్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పరోక్షంగా లభించింది.
  • ఇక ఫాంటసీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌లు ₹2,800 కోట్ల వరకూ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్జించాయి. గత ఐపీఎల్‌ సీజన్‌లోని ఆదాయం(₹2,250 కోట్లు)తో పోల్చితే ఇది 24 శాతం అధికం. ఈ గేమింగ్‌ ప్లాట్‌పామ్‌లలో 61 మిలియన్‌ యూజర్లు పాల్గొన్నారు.
  • ఈ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లలో IPL 2023లో కొత్తగా 35 శాతం యూజర్లు ఆడారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని